ప్రభాస్ పెళ్లి అందుకే ఆలస్యం అవుతుందా? అసలు కారణమేంటి....       2018-05-27   01:46:12  IST  Raghu V

బాహుబలి సినిమా తరువాత మన తెలుగు వాళ్ళకే కాదు దేశం లో ఉన్న వివిధ సినీ పరిశ్రమల్లో అభిమానులను సంపాదించుకున్నాడు.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే ప్రశ్న అందరికి ఉంది.ఆయన పెళ్లి గురించి మిర్చి సినిమా ముందే చాలా పుకార్లు వచ్చాయి, డార్లింగ్ సినిమా చేస్తున్నపుడు ప్రభాస్ కాజల్ ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ దాన్ని ప్రభాస్ కుటింబికులు కొట్టిపడేశారు. ఇక పోతే ప్రభాస్ పక్కన సినిమాల్లో సరిగ్గా సరిపోయే భామ అనుష్క వీరిద్దరిని ఆన్ స్క్రీన్ పైన చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది , వీరిద్దరూ కలిసి మూడు సినిమాలు తీశారు.వీరి మధ్య కూడా ప్రేమ నడుస్తుందని రేపో మాపో పెళ్లి అంటూ టాక్ వచ్చింది..కానీ అసలు విషయం ప్ర‌భాస్ క్ష‌త్రియ కులానికి చెందిన‌వాడు. అస‌లే అమ్మాయిలు దొర‌క‌క చాలా మంది పెళ్లి కాని ప్ర‌సాద్ లున్నారు. మ‌రి ప్ర‌భాస్ క్ష‌త్రియ కులం కాబ‌ట్టి అమ్మాయి దొర‌క‌డం ఇంకా క‌ష్ట‌మ‌ని తేలింది. వేయి మంది అబ్బాయిల‌కు 750 మంది అమ్మాయిలు మాత్ర‌మే ఉన్నార‌ని ఆ మ‌ధ్య ఓ స‌ర్వేలో తేలింది.

అమ్మాయిలు నచ్చడం లేదా ?

ఇప్పుడు ప్ర‌భాస్ ను వెంటాడుతోన్న అస‌లు స‌మ‌స్య అమ్మాయేన‌ని అంటున్నారు. పోనీ వేరే కులానికి వెళ్ల‌డం అంటే చిన్న విష‌యం కాదు. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన పెద్ద‌లు ప్రభాస్ ఆ వ‌ర్గానికి చెందిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాల‌ని కృష్ణం రాజుపై ఒత్తిడి తీసుకొస్తున్నారుట‌. పొర‌పాటున వేరే కులం అమ్మాయితే పెళ్లి చేస్తే బ‌హిష్క‌ర‌ణ తప్ప‌ద‌ని గ‌ట్టిగానే హెచ్చ‌రించిన‌ట్లు లీకైంది. క్ష‌త్రియ కులంలో ఉన్న కొంత‌మంది అమ్మాయిల ఫోటోల‌ను ప్ర‌భాస్ కు చూపించినా న‌చ్చ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో ప్ర‌భాస్ పెళ్లి ఇప్ప‌ట్లో అయ్యేలా క‌నిపించ‌లేదు.

సినిమాల తో బిజీ

ప్రభాస్ పెళ్లి గురించి 2010 నుండి టాక్ నడుస్తుంది , ఈ ఒక్క సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుంది అనుకున్నపుడల్లా కొత్త సినిమాలు చేయడం పెళ్లి మాట ముందుకు వెళ్లడం జరుగుతుంది. అయితే బాహుబలి సినిమా షూటింగ్ తర్వాత ప్రభాస్ పెళ్లి తప్పక ఉంటుంది అనుకున్న యంగ్ రెబెల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.. ప్రస్తుతం రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో భారీ బడ్జెట్ సినిమా సాహో షూటింగ్ లో బిజీ అయిపోయారు ప్రభాస్ , ఈ సినిమా తరువాతైన ప్రభాస్ ఒక ఇంటి వాడు అవుతాడేమో చూడాలి..