ప్రభాస్‌ మోజు ఖరీదు కోట్ల రూపాయలు... తల పట్టుకుంటున్న నిర్మాతలు  

Prabhas Takes Cars And Bikes From Saaho-garage,prabhas,prabhas Home,saaho Movie

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్‌లో 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అత్యాధునిక బైక్‌లు మరియు ఆధునిక కార్లను తీసుకు వస్తున్నారు. కొన్ని కార్లకు విభిన్నమైన మేకోవర్‌ చేసి కొత్త డిజైన్‌ చేస్తున్నారు. అలా ఆ కార్లతో చాలా రోజులుగా షూటింగ్‌ చేస్తున్న ప్రభాస్‌ వాటిపై మోజు పెంచుకుంటున్నాడు. షూటింగ్‌ సమయంలో వాటిని వాడి వాడి ఉన్న ప్రభాస్‌ షూటింగ్‌ తర్వాత కూడా వాటిని వదల్లేక పోతున్నాడు...

ప్రభాస్‌ మోజు ఖరీదు కోట్ల రూపాయలు... తల పట్టుకుంటున్న నిర్మాతలు-Prabhas Takes Cars And Bikes From Saaho

దాంతో షూటింగ్‌ అయిన తర్వాత వాటిని ఇంటికి తీసుకు వెళ్తున్నాడట.

సాహో ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు పలు బైక్‌లు మరియు రెండు కార్లను ప్రభాస్‌ తన ఇంట్లో ఉన్న గ్యారేజ్‌కు తీసుకు వెళ్లాడట. కోట్ల విలువ చేసే బైక్‌లు మరియు కార్లను ప్రభాస్‌ ఇంట్లో పెట్టుకుంటున్న కారణంగా నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. ప్రభాస్‌కు నిర్మాతలు చాలా సన్నిహితులు.

నిర్మాణంలో ప్రభాస్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏం మాట్లాడలేక పోతున్నారట. ప్రభాస్‌ మోజు పడి ఇంట్లో పెడుతున్న వాహనాల ఖరీదు దాదాపుగా రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ఉంటుందట..

‘సాహో’ చిత్రం కోసం హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందుకోసం భారీ ఎత్తున అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రంను ఇదే సంవత్సరం ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.