ఇచ్చిన మాట కోసం వెనక్కు తగ్గని ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్.. ఫలితం ఏంటో?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కు ఉన్న ప్రాధాన్యత దేనికీ ఉండదు.దర్శకుడి గత సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే స్టార్ హీరోలు ప్రాజెక్ట్ లను క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.

 Prabhas Junior Ntr Decisions Not Changed In That Matter Details Here , Junior Ntr,prabhas, Koratala Shiva,acharya Movie,prabhas Maruti Combination,young Tiger Ntr Koratala Shiva Combo-TeluguStop.com

అయితే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దర్శకుల గత సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఇచ్చిన మాట కోసం తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో ముందుకెళుతున్నారు.దర్శకుల సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది రిలీజై అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు కొరటాల శివకు ఆర్థికంగా నష్టం కలిగించిన సినిమాలలో ఆచార్య సినిమా ఒకటి.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి ఫ్లాప్ టాక్ వైరల్ అయింది.

 Prabhas Junior Ntr Decisions Not Changed In That Matter Details Here , Junior NTR,Prabhas, Koratala Shiva,Acharya Movie,Prabhas Maruti Combination,Young Tiger NTR Koratala Shiva Combo-ఇచ్చిన మాట కోసం వెనక్కు తగ్గని ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్.. ఫలితం ఏంటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా థియేటర్లలో పుంజుకునే పరిస్థితి కనిపించలేదు.ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేకపోవడం గమనార్హం.

అయితే ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా కొరటాల శివ డైరెక్షన్ లో నటించే విషయంలో తారక్ వెనక్కు తగ్గడం లేదు.కొరటాల శివ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నా తారక్ మాత్రం ఎదురుచూస్తున్నారే తప్ప కొరటాలపై ఒత్తిడి పెంచడం లేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ 2023 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Acharya, Ntr, Koratala Shiva, Prabhas, Prabhas Maruti, Youngtiger-Movie

మరోవైపు పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు ముందే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది.పక్కా కమర్షియల్ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ వెనక్కు తగ్గడం లేదు.నిర్మాత మారినా ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనుకడుగు వేయనని ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు.

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని ఈ దర్శకులు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube