ప్రభాస్‌ 50 కోట్ల కాస్ట్‌ కట్టింగ్‌, ఎందుకో తెలుసా?

బాహుబలి చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్‌ తాజాగా సాహో చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 450 కోట్ల రూపాయలను ప్రభాస్‌ రాబట్టాడు.కాని సాహో చిత్రం 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కారణంగా పెట్టిన బడ్జెట్‌ పూడలేదని సమాచారం.200 కోట్ల బడ్జెట్‌తో సాహో చిత్రాన్ని తెరకెక్కించి ఉంటే సినిమాకు మంచి లాభాలు వచ్చేవని ట్రేడ్‌ వర్గాల వారి అభిప్రాయం.సాహో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచేదని కూడా చాలా మంది అభిప్రాయం.

 Prabhas John Movie Latest Update-TeluguStop.com

అందుకే బడ్జెట్‌ విషయంలో ఇకపై ప్రభాస్‌ జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నాడట.

Telugu Prabhasradha, Prabhas, Prabhasbahubali, Prabhasjohn-

  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’ అనే చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు.ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.మొదట ఈ చిత్రాన్ని దాదాపుగా 175 కోట్లతో రూపొందించాలని భావించారు.

కాని సాహో ఎఫెక్ట్‌ కారణంగా సినిమాకు కనీసం 50 కోట్లు అయినా కాస్ట్‌ కట్టింగ్‌ చేయాలని దర్శకుడు రాధాకృష్ణకు ప్రభాస్‌ సూచించాడని సమాచారం అందుతోంది.

Telugu Prabhasradha, Prabhas, Prabhasbahubali, Prabhasjohn-

  100 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేస్తే ఇతర హీరోలకు కాస్త కష్టం కావచ్చు.కాని ప్రభాస్‌కు ఆల్‌ ఓవర్‌ ఇండియాలో అభిమానులు ఉన్నారు.ఇండియా వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న మార్కెట్‌ కారణంగా ఆయన ఈజీగానే 100 కోట్లను రాబట్టగలడు.

అందుకే ప్రభాస్‌ సినిమా 100 కోట్ల బడ్జెట్‌ అంటే పర్వాలేదు.అందుకే జాన్‌ చిత్రం బడ్జెట్‌ను కాస్త తగ్గించి 100 కోట్లకు కాస్త అటు ఇటుగా చేయాలని నిర్ణయించారు.

కృష్ణం రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube