30 కోట్లు... ప్రభాస్‌ దానికి కూడా తగ్గట్లేగా  

Prabhas Jaanu Movie Budget News-jaanu,movie,prabhas,జాను,ప్రభాస్

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సినీ కెరీర్‌ను రెండు పార్ట్‌లుగా విభజించవచ్చు. బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్లుగా ఆయన కెరీర్‌ సాగుతుంది. బాహుబలి ముందు వరకు ప్రభాస్‌ సినిమాల బడ్జెట్‌ 20 కోట్ల లోపులోనే. కాని బాహుబలికి ఏకంగా వందల కోట్ల బడ్జెట్‌ పెట్టడంతో ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది..

30 కోట్లు... ప్రభాస్‌ దానికి కూడా తగ్గట్లేగా-Prabhas Jaanu Movie Budget News

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ బాలీవుడ్‌ స్టార్‌లను సైతం క్రాస్‌ చేశాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్‌ నేపథ్యంలో ప్రభాస్‌ చేస్తున్న తర్వాత సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి.

ప్రస్తుతం సుజీత్‌ దర్శకత్వంలో సాహో చిత్రం రూపొందుతోంది.

యూవీ వార ఈ చిత్రాన్ని ఏకంగా 250 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో యాక్షన్‌ సీన్స్‌ను చేయిస్తూ నిర్మిస్తున్నారు. సాహో మాత్రమే భారీ బడ్జెట్‌ అనుకుంటే ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్న ఇంకో సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్‌ అంటూ సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ చేస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీకి ఏకంగా 100 కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టబోతున్నారట. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రంను యూవీ వారు నిర్మిస్తున్నారు. జాను అనే టైటిల్‌ను ఈ చిత్రంకు పరిశీలిస్తున్నారు.

ఒక వైపు సాహో చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూనే బ్రేక్‌లో జాను చిత్రాన్ని కూడా ప్రభాస్‌ చేస్తున్నాడు.

తాజాగా జాను చిత్రం కోసం ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఆ షెడ్యూల్‌కు ఏకంగా 30 కోట్లను ఖర్చు చేయబోతున్నారట. ఒక షెడ్యూల్‌కు 30 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ఆ సీన్స్‌ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ వరుసగా వందల కోట్ల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, వచ్చే ఏడాది జాను చిత్రం రాబోతుంది.