పేరు మార్చుకున్న ప్రభాస్.. అయోమయంలో ఫ్యాన్స్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

 Prabhas Jaan Movie Title To Be Changed As John-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ ఫోటోలో ప్రభాస్ చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపించాడు.ఇకపోతే ఈ సినిమాకు జాన్(Jaan) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా ఈ సినిమాకు జాన్(John) అనే పేరును పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండటంతో జాన్ పేరునే సినిమాకు పెట్టాలని వారు చూస్తున్నారట.

ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా ఏమిటో చూపించడం ఖాయమని అంటున్నారు ప్రేక్షకులు.కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమా టైటిల్ విషయంలో ఏది ఫైనల్ అనేది మాత్రం చిత్ర యూనిట్ చెప్పేంత వరకు సస్పెన్స్ తప్పదంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube