త్రివిక్రమ్ - దిల్ రాజు సినిమాలో హీరో అతనేనా

గత కొనేళ్ళుగా నిర్మాతగా సరైన ఫామ్ లో లేరు దిల్ రాజు.ఒకప్పుడు ఆర్య, దిల్, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం .

 Prabhas Is The Hero In Trivikram – Dil Raju Project ?-TeluguStop.com

ఇలా వరుసపెట్టి బ్లాక్బబస్టర్స్ అందుకున్న దిల్ రాజు ఈ మధ్య కాలంలో చాలా నేమ్మదించారు.దిల్ రాజు నుంచి వచ్చిన చివరి బ్లాక్బస్టర్ సినిమా ఏంటి అంటే కాసేపు ఆలోచించాల్సిందే.

ఇన్నిరోజుల్లాగా కేవలం యువ దర్శకులనే నమ్ముకుంటే పని అవ్వదు అనుకున్నారేమో, ఇకనుంచి అగ్ర దర్శకులతో కూడా సినిమా తీస్తారట.అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక స్టార్ హీరోతో సినిమా ఉంటుందని ప్రకటించారు.

ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో ?

2014వ సంవత్సరంలో ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారు త్రివిక్రమ్ – దిల్ రాజు.అప్పుడు హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు.

బాహుబలి ప్రాజెక్టు నుంచి ప్రభాస్ విడుదల అవగానే సినిమా మొదలుపెడదామని అప్పుడే మాట్లాడుకున్నారు.ఇదే చర్చ మళ్ళీ రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య జరిగింది.

దీన్నిబట్టి చూస్తే దిల్ రాజు చెప్పిన ఆ స్టార్ హీరో ప్రభాసే .

కాని ఇదే ఫైనల్ అనుకోలేం.ఎందుకంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో, ప్రభాస్ సుజీత్ తో సినిమా మొదలుపెట్టాలి.ఆ రెండు సినిమాలు అయిపోయాకా ఇద్దరి వీలుని బట్టి సినిమా ప్రభాస్ తో ఉంటుందా లేకా మరో స్టార్ హీరో చేస్తాడా అనేది నిర్ణయించుకుంటారు.

అప్పటిదాకా సస్పెన్స్ తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube