హోంబలే ఫిలిమ్స్ నుంచి కేజీఎఫ్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమా ఉండబోతుంది అనేది కూడా ఒక స్పష్టత ఇచ్చారు.
ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉండబోతుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని కలిసి స్టోరీ నేరేట్ చేసి రావడంతో ఇదే ప్రాజెక్ట్ పై చర్చించారని టాక్ బలంగా వినిపించింది.
అందరూ అనుకున్నట్లే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ హీరోగానే సినిమాని ఈ రోజులు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.అదిరిపోయే విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబందించిన టైటిల్, హీరో ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు.
ఇక ఈ లుక్ లో గన్ పట్టుకొని చాలా స్టైలిష్ గా కూర్చొని ప్రభాస్ ఉన్నాడు.ఇక ఈ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాకి సలార్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.ఇక ఈ కథ కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంగానే ఉండబోతుంది అని చిత్ర నిర్మాతలు రివీల్ చేశారు.
ఇందులో ప్రభాస్ పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా కనిపించబోతున్నాడు.ఓ విధంగా చెప్పాలంటే మాఫియా డాన్ గా ఎదిగిన ఒక కిరాతకుడు స్టోరీగా ఇది ఉండబోతుంది అని ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ సినిమా కేజీఎఫ్ ని మించి ఉంటుందని టాక్.ఇందులో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటులు కీలక పాత్రలలో నటించబోతున్నారు.
ఇక ఈ సినిమాకి సంబందించిన ఇతర వివరాలని త్వరలో తెలియజేయనున్నట్లు తెలుస్తుంది.