ప్రభాస్ రెబల్ స్టార్ కాదు ఇండియన్ మెగాస్టార్.. ఫ్లెక్సీలు వేసి రచ్చ రచ్చ!

Prabhas Is Not A Rebel Star He Is An Indian Megastar

కొందరు అభిమానులు తమ అభిమాన నటీనటుల కోసం ఏమైనా చేస్తారు.ఎంత రచ్చ కైనా సరే దిగుతారు.

 Prabhas Is Not A Rebel Star He Is An Indian Megastar-TeluguStop.com

అంతేకానీ తమ అభిమాన నటుల కోసం అస్సలు తగ్గరు.కొందరు తమ అభిమాన నటుల కోసం పాదయాత్రలు చేస్తే మరికొందరు ఇతరులకు సహాయం చేస్తారు.

వేరే అభిమానుల సంఘాలతో తమ అభిమాన హీరోనే గొప్ప అంటూ గొడవలకు కూడా దిగుతారు.ఇదిలా ఉంటే ప్రభాస్ కోసం కూడా కొందరు అభిమానులు రచ్చరచ్చ చేశారు.

 Prabhas Is Not A Rebel Star He Is An Indian Megastar-ప్రభాస్ రెబల్ స్టార్ కాదు ఇండియన్ మెగాస్టార్.. ఫ్లెక్సీలు వేసి రచ్చ రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తొలిసారిగా 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకోవడంతో వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదగడంతో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి అభిమానం పెంచుకున్నాడు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోలకున్న గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Telugu Salaar, Adipurush, Indian, Poster, Prabhas, Prabhasbirhtday, Prabhas Fans, Prabhasindia, Radhe Shyam, Rebel, Tollywood-Movie

ప్రభాస్ కు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి అభిమానం ఉంది.ఈయన సినిమాల కోసం ఆ అభిమానులు ఎదురు చూసే చూపులు అంతా ఇంతా కాదు.ఈయన సినిమా థియేటర్ లో విడుదలైందంటే చాలు ఫ్లెక్సీలతో రచ్చ రచ్చ చేస్తారు అభిమాన సంఘాలు.

ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు.

Telugu Salaar, Adipurush, Indian, Poster, Prabhas, Prabhasbirhtday, Prabhas Fans, Prabhasindia, Radhe Shyam, Rebel, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ అభిమాన సంఘాలు ఓ రేంజ్ లో రచ్చ చేశారు.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.ఓ నెటిజన్ దమ్ముంటే ఆఫ్ లైన్ లో ఇండియన్ మెగాస్టార్ అనే ట్యాగ్ తో ఓ బ్యానర్ కట్టండి రా అంటూ ట్వీట్ చేయగా వెంటనే ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతూ.

ఆ ట్వీట్ కు స్పందించి తమ ఏంటో నిరూపించుకున్నారు.

Telugu Salaar, Adipurush, Indian, Poster, Prabhas, Prabhasbirhtday, Prabhas Fans, Prabhasindia, Radhe Shyam, Rebel, Tollywood-Movie

అంతేకాకుండా తాము వేయించుకున్న ఇండియన్ మెగా స్టార్ ప్రభాస్ అనే ఫ్లెక్సీని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.ప్రతి ఏరియా లో ప్రతి బ్యానర్ లో ఇండియన్ మెగా స్టార్ ప్రభాస్ అని వేసామని ఫ్లెక్సీలతో రచ్చరచ్చ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారగా ఈ ట్వీట్ ను చూసిన ప్రభాస్ అభిమానులు తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే రేపు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ అభిమానులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ప్రభాస్ పలు సినిమాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అందులో రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలో బిజీగా ఉన్నాడు.వీటితో పాటు మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నాడు ప్రభాస్.

#Rebel #Prabhas #Salaar #PrabhasBirhtday #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube