పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్.. రాధేశ్యామ్ అదిరిపోయే పోస్టర్ విడుదల!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది.

 Prabhas Introduces Pooja Hegdes Character As Prerana From Radhe Shyam On Her Birthday-TeluguStop.com

ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే బాలన్స్ ఉందని సమాచారం.ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.అన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు మళ్ళీ రిలీజ్ డేట్ ప్రకటించారు.

 Prabhas Introduces Pooja Hegdes Character As Prerana From Radhe Shyam On Her Birthday-పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్.. రాధేశ్యామ్ అదిరిపోయే పోస్టర్ విడుదల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈసారి ఇక వాయిదా పడే అవకాశం అయితే కనిపించడం లేదు.

భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ రోజు పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సర్ప్రైజ్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ ద్వారా పూజా లుక్ ను విడుదల చేసారు మేకర్స్.ఇక ఈ అదిరిపోయే పోస్టర్ చుసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మేకర్స్ విడుదల చేసిన బర్త్ డే పోస్టర్ లో పూజా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

చుట్టూ కూడా అద్భుతంగా వింటేజ్ లుక్ తో చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు.అంత అందంగా ఉంది పూజ హెగ్డే.ఇక రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది.

ఈ పోస్టర్ లో హ్యాపీ బర్త్ డే ప్రేరణ అంటూ రివీల్ చేసారు.ఈ పోస్టర్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ చేసారు.

మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎంత మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

#PrabhasPooja #Radhe Shyam #Radhe Shyam #Prabhas #Prerana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు