ప్రభాస్ ఎంట్రీతోనే ఏడు లక్షలు ఫాలో అయ్యారు  

ప్రభాస్ పేరు చూసిన ఇన్స్టాగ్రామ్ లో ఏడు లక్షల మంది ఫాలో. .

Prabhas Instagram Followers Cross Seven Lakhs-instagram Followers,prabhas,seven Lakhs,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజీ ఉంది. బాహుబలి సినిమా ప్రభావం దేశ వ్యాప్తంగా ఉండటంతో నార్త్ ఇండియా జనాలు ప్రభాస్ కి బాలీవుడ్ హీరోల రేంజ్ లో అభిమానిస్తున్నారు. ఇక అతని నెక్స్ట్ సినిమా సాహో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

ప్రభాస్ ఎంట్రీతోనే ఏడు లక్షలు ఫాలో అయ్యారు-Prabhas Instagram Followers Cross Seven Lakhs

అలాగే సాహో సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ క్రేజ్ కి తిరుగేలేదు అని చెప్పాలి. అతనిని పేస్ బుక్ లో కోటి మందికి పైగా ఫాలో అవుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంట్రీ ఇచ్చిందే తడువుగా ప్రభాస్ అతని అభిమానులు ఫాలో అవడం మొదలెట్టారు. ఇక అకౌంట్ ఓపెన్ చేసి ఎలాంటి పోస్టింగ్ లు పెట్టకుండానే ఏకంగా ఏడు లక్షల మంది అతనిని ఫాలో అవడం విశేషం.

అయితే ఇది ప్రభాస్ ఒరిజినల్ యూజర్ కాదని, అసలు అతను ఇన్స్టగ్రామ్ లోకి రాలేదని అది ఫేక్ అకౌంట్ అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఏది ఏమైనా ఇలా ఏడు లక్షల మంది కేవలం ప్రభాస్ పేరు చూసి ఫాలో అయ్యారంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.