అండర్ గ్రౌండ్ లో ప్రభాస్.. ఈ నిర్ణయం వెనుక రహస్యం ఏంటంటే?

Prabhas In The Underground What Is The Secret Behind This Decision

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్ హై రేంజ్ లో దూసుకుపోతున్నాడు.వరుసగా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు.

 Prabhas In The Underground What Is The Secret Behind This Decision-TeluguStop.com

బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు.

 Prabhas In The Underground What Is The Secret Behind This Decision-అండర్ గ్రౌండ్ లో ప్రభాస్.. ఈ నిర్ణయం వెనుక రహస్యం ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ఇప్పటికే ఈయన సినిమా షూటింగులు వాయిదాలతో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది.మెల్లిమెల్లిగా తిరిగి కోలుకొని మళ్లీ షూటింగ్ బిజీలో ఉన్నాయి.

అందులో ఆది పురుష్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోగా.

సలార్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

అంతేకాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ కూడా మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి.వీటితో పాటు మరిన్ని సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Telugu Prabhas, Tollywood, Underground-Movie

అదేంటి ప్రభాస్ అక్కడ ఉండటం ఏమిటి, ఇంతకు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అనుకుంటున్నారా.ప్రస్తుతం కోవిడ్ కారణంగా పలు సినిమాలకు అంతరాయం కలగడంతో.హీరోలంతా ఈ సమయాన్ని తమ ఫ్యామిలీతో గడుపుతున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదని టాక్ వస్తుంది.దాంతో అతడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని అక్కడే కొన్ని సినిమా కథలు కూడా వింటున్నట్లు తెలుస్తుంది.

#Underground #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube