ప్రభాస్ మీద కన్నేశారు

ఎత్తైన రూపం .కండలు తిరిగిన దేహం .

 Prabhas In Rudramadevi Sequel?-TeluguStop.com

బలంగా వినబడే గొంతు… కటౌట్ అంటే ఇదిరా అనేలా ఉంటాడు ప్రభాస్.ఆ కటౌట్ వల్లే ఫీమేల్ ఫాలోయింగ్.

ఆ కటౌట్ వల్లే మొదట ఛత్రపతి , ఆ తరువాత బాహుబలిలో ఏరికోరి మరి ప్రభాస్ ని ఎంచుకున్నాడు రాజమౌళి.ఇప్పుడు ఆ కటౌట్ మీద మరో దర్శకుడి కన్ను పడింది.

రుద్రమదేవితో చేతులు కాల్చుకున్న గుణశేఖర్, దానికి సీక్వెల్ గా “ప్రతాపరుద్రుడు” ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తోనే ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

ఆ తరువాత ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం “ప్రతాప రుద్రుడు” పాత్రకు ప్రభాస్ అయితేనే సరిగ్గా సరిపోతాడని గుణశేఖర్ భావిస్తున్నారట.

బాహుబలి పూర్తి అయిన తరువాత రెండు సినిమాలు పూర్తి చెయ్యాలి ప్రభాస్.మరి మన యంగ్ రెబల్ స్టార్ ఒప్పుకుంటే టైమ్ తీసుకోనైనా ఈ సినిమా మొదలుపెట్టాలని గుణశేఖర్ డిసైడ్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube