జాన్‌ మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఇచ్చిన ప్రభాస్‌, అందరు అభినందిస్తున్నారు

ప్రభాస్‌ ‘సాహో’ తర్వాత చేస్తున్న చిత్రం జాన్‌.రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను కృష్ణం రాజు మరియు యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు.

 Prabhas Impotentcommand To The Jaan Movie Makers-TeluguStop.com

మొదట ఈ సినిమాను దాదాపుగా 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని భావించారు.కాని సాహో ఫలితం తర్వాత బడ్జెట్‌ కుదింపు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందనే ఉద్దేశ్యం అందరిలో కూడా ఉంది.వారి నమ్మకంను నిలబెడుతూనే సినిమాను కాస్త తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేయాలంటూ ప్రభాస్‌ కోరుతున్నాడట.

జాన్‌ సినిమా ఎక్కువగా ఇటలీలో చిత్రీకరణ ప్లాన్‌ చేశాడు.ఇప్పటికే దాదాపుగా రెండు నెలల షెడ్యూల్‌ అక్కడ అయ్యింది.ఇటలీలో చిత్రీకరణ అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది.అందుకే ఈ చిత్రం ఇటలీలో చిత్రీకరణ జరపకూడదని నిర్ణయించారు.

ఎందుకంటే బడ్జెట్‌ పరిధి దాటి పోకుండా ఉండాలని భావిస్తున్నారు.సినిమాను ఎక్కువగా ఇన్‌ డోర్‌ సెట్టింగ్స్‌లో రూపొందించాలని కూడా దర్శకుడు రాధాకృష్ణకు ప్రభాస్‌ అండ్‌ టీం సూచించినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రభాస్‌ మరియు పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ చిత్రంలో 1980 నేపథ్యం కథను చూపించబోతున్నారు.అన్ని వర్గాల వారికి సంబంధించిన ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉండేలా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోందట.త్వరలోనే రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇటలీ సెట్టింగ్స్‌లో సినిమా షూట్‌ చేయబోతున్నారట.వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

.

#Prabhas #Jaan Makers #Jaan #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు