సెంటిమెంట్‌ను పక్కనబెట్టి రిస్క్ చేస్తున్న ప్రభాస్  

Prabhas Ignores Negative Sentiment-john Movie,krishnam Raju,prabhas,radha Krishna

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘జాన్’ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు.సాహో తరువాత డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ ఈ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Prabhas Ignores Negative Sentiment-John Movie Krishnam Raju Prabhas Radha Krishna

అయితే ఈ సినిమాలో ప్రభాస్‌కు ఏమాత్రం కలిసిరాని ఓ నెగెటివ్ సెంటిమెంట్‌ను ప్రభాస్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జాన్ సినిమాను ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు.అయితే గతంలో ప్రభాస్‌తో కలిసి కృష్ణంరాజు నటించిన రెబెల్, బిల్లా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి.

ప్రభాస్-కృష్ణంరాజు కలిసి నటించిన రెండు సినిమాలు బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఆ ప్రభావం జాన్ సినిమాపై కూడా కనిపిస్తోంది.

మరోసారి తన పెద్దనాన్నతో సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

జాన్ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో అని వారు భయపడుతున్నారు.ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ వారు నిర్మిస్తుండగా హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా రివీల్ చేయలేదు.

తాజా వార్తలు