అతి త్వరలో 'యూవీ' టాలీవుడ్ షేక్‌ అయ్యే ప్రకటన

టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థల హవా కొనసాగుతున్నాయి.ఆ నిర్మాణ సంస్థల్లో మాత్రమే వరుసగా పెద్ద సినిమా లు వస్తున్నాయి.

 Prabhas Home Banner Uv Creations Coming With Ott Platform-TeluguStop.com

అందులో ఒకటి ప్రభాస్‌ తన సన్నిహితులతో కలిసి ఏర్పాటు చేసిన యూవీ క్రియేషన్స్.ప్రభాస్ వరుసగా ఆ బ్యానర్‌ లో సినిమా లు చేస్తున్నాడు.

సాహో సినిమా తర్వాత రాధే శ్యామ్‌ సినిమా ను కూడా అదే బ్యానర్‌ లో ప్రభాస్ చేసిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రాధే శ్యామ్‌ సినిమా తో పాటు చిన్న బడ్జెట్‌ సినిమా లను కూడా యూవీ వారు నిర్మిస్తున్నారు.

 Prabhas Home Banner Uv Creations Coming With Ott Platform-అతి త్వరలో యూవీ’ టాలీవుడ్ షేక్‌ అయ్యే ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వరుసగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న యూవీ క్రియేషన్స్‌ వారు అతి త్వరలో సొంత ఓటీటీ ని ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో వరుసగా భారీ సినిమా లను వీరు నిర్మించడంతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి క్రేజ్ ను దక్కించుకున్నారు.

ఉత్తరాదిన కూడా ప్రభాస్ కు మంచి స్టార్‌ డమ్‌ ఉంది.ఆ కారణంగా యూవీ ని వారు కూడా ఆధరిస్తారని అంటున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ వారు ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి సినిమా లను నిర్మించడం జరిగింది.ఇప్పుడు కొత్తగా వారి నుండి ఓటీటీ వస్తే తప్పకుండా అది కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు లో ఆహా ఓటీటీ ఉంది.ఇక ఇతర భాషల కంటెంట్ ను ఇచ్చే ఓటీటీ లు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో యూవీ వారు తీసుకు వచ్చే ఓటీటీ కి ఎంత వరకు ఆధరణ ఉంటుంది అంటూ నమ్మకం తక్కువ అంటూ కొందరు అంటున్నారు.కాని ప్రభాస్ బ్రాండ్ మరియు కంటెంట్‌ విషయంలో కొత్తదనం భారీ తనంను చూపిస్తే ఖచ్చితంగా యూవీ ఓటీటీ మరో అమెజాన్ ప్రైమ్‌ మాదిరిగా దూసుకు పోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

చూద్దాం యూవీ ఓటీటీ ఏ మేరకు సక్సెస్ అయ్యేనో.

#UV Creations #Uv Ott #Prabhas #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు