ఈ ఫోటోలోని ప్రభాస్ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు కృతిసనన్.సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటించడంతో పాటు ఆ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

 Prabhas Heroine Childhood Photo Goes Viral In Social Media, Childhood Photo, Goe-TeluguStop.com

ఆ సినిమాలోని పాత్రతో నటిగా మంచి పేరు సొంతం చేసుకున్న కృతి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో భారీగా ఆఫర్లను సొంతం చేసుకోలేకపోయారు.

ఆ తరువాత సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన దోచెయ్ సినిమాలో కూడా కృతిసనన్ నటించగా ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు.ఈ హీరోయిన్ యొక్క చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కృతిసనన్ తండ్రితో కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Telugu @kritisanon, Childhood, Kruti Sanon, Prabhas-Movie

కృతిసనన్ తండ్రి పేరు రాహుల్ సనన్ కాగా తండ్రి పుట్టినరోజు సందర్భంగా కృతిసనన్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.ప్రపంచంలో తనకు తండ్రి ఎంతో ఇష్టమైన వ్యక్తి అంటూ కృతి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు.ఆదిపురుష్ సినిమాతో కృతిసనన్ ఇతర ఇండస్ట్రీల్లో కూడా గుర్తింపును సంపాదించుకునే అవకాశాలు ఐతే ఎక్కువగా ఉన్నాయి.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు బచ్చన్ పాండే, హమ్ దే హమారే దో సినిమాల్లో కృతిసనన్ నటిస్తున్నారు.2022 సంవత్సరం ఆగష్టు నెల 11వ తేదీన ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా కోసం ప్రభాస్ తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube