ఫ్యాన్ కోసం ఆ పని చేసిన ప్రభాస్.. చనిపోతాడని తెలిసి..?- Prabhas Heart Touching Story Cancer Patient Last Wish

prabhas heart touching story fulfilled cancer patient last wish , prabhas, vempa kasi, cancer patient, basavatarakam hospital, prabhas kindness, vempa kasi about prabhas, prabhas fans, prabhas fulfilled fan wish - Telugu Basavatarakam Hospital, Cancer Patient, Prabhas, Prabhas Fans, Prabhas Fulfilled Fan Wish, Prabhas Kindness, Vempa Kasi, Vempa Kasi About Prabhas

స్టార్ హీరో ప్రభాస్ కు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ మార్కెట్ రేంజ్ ను పెంచితే ఆ మార్కెట్ ను కాపాడుకునేలా ప్రభాస్ తన సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.

 Prabhas Heart Touching Story Cancer Patient Last Wish-TeluguStop.com

అయితే స్టార్ హీరోలలో చాలామంది అభిమానులపై పైకి అభిమానం చూపించినా అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం స్పందించడానికి ఇష్టపడరు.అయితే స్టార్ హీరో ప్రభాస్ మాత్రం ఒక అభిమాని కోసం చేసిన పని తెలిసి ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు.

కొన్నేళ్ల క్రితం ఈ ఘటన జరిగినా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల అభిమానులు బాధ పడుతుంటే అభిమానుల చివరి కోరిక తీర్చాలనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోలు అభిమానుల ఇళ్లకు వెళ్లి కలిసిన సందర్భాలు ఉన్నాయి.

 Prabhas Heart Touching Story Cancer Patient Last Wish-ఫ్యాన్ కోసం ఆ పని చేసిన ప్రభాస్.. చనిపోతాడని తెలిసి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన వెంప కాశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గొప్పదనం గురించి వెల్లడించారు.

భీమవరంకు చెందిన ఈ వ్యాపారవేత్త ప్రభాస్ తనకు బాగా తెలుసని అన్నారు.ప్రభాస్ కోడిపందేలకు రావాలని ఉందని కానీ ప్రభాస్ వస్తే జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని అన్నారు.మా కజిన్ కొడుకుకు 20 సంవత్సరాలు అని క్యాన్సర్ బారిన పడిన కజిన్ కొడుకు పదిరోజుల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పారని ఆ అబ్బాయి చివరి కోరికగా ప్రభాస్ షూటింగ్ కు తీసుకెళ్లాలని కోరాడని వెంప కాశీ చెప్పారు.

అయితే ప్రభాస్ షూటింగ్ కు వెళ్లాలనుకునే లోపు బాబుకు సీరియస్ అయిందని నాలుగు గంటల్లో చనిపోతాడని చెప్పారని ఈ విషయం తెలిసి ప్రభాస్ షూటింగ్ ఆపి గంట సమయం ఆ అబ్బాయితో ఉన్నాడని వెంప కాశీ చెప్పారు.క్యాన్సర్ పేషెంట్ కు ప్రభాస్ ముద్దు పెట్టడని 2 గంటల్లో చనిపోతాడని అనుకున్న ఆ అబ్బాయి 20 రోజులు బ్రతికాడని వెంప కాశీ తెలిపారు.

ఆ తరువాత ప్రభాస్ కాల్ చేసి మళ్లీ అవసరమైతే వస్తానని తనకు చెప్పాడని వెంప కాశీ పేర్కొన్నారు.

#VempaKasi #Vempa Kasi #Prabhas Fans #Prabhas #Cancer Patient

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు