ఆర్ఆర్ఆర్ లో మెరవనున్న ప్రభాస్  

ఆర్ఆర్ఆర్ లో గెస్ట్ రోల్ చేస్తున్న ప్రభాస్.

Prabhas Guest Role In Rrr Movie-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో పాటు, పీరియాడికల్ లవ్ స్టొరీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలతో దేశ వ్యాప్తంగా తన సత్తా చాటాలని ప్రభాస్ వెయిట్ చేస్తున్నాడు.

Prabhas Guest Role In Rrr Movie--Prabhas Guest Role In RRR Movie-

మరో వైపు బాహుబలితో ప్రపంచ ద్రుష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ లతో భారీ మల్టీ స్టారర్ గా ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కుస్తున్నాడు.ఈ సినిమా మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభం అవుతుంది.ఈ సినిమాలో ఇప్పటికే అజయ్ దేవగన్, అలియా భట్ లాంటి స్టార్స్ నటిస్తూ ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడని చెప్పుకుంటున్నారు.ఇందులో తారక్ కి జోడీగా కనిపించే హాలీవుడ్ భామ తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం హీరోయిన్ వేటలో ఉన్న జక్కన్న టీం ప్రభాస్ ని కూడా ఈ సినిమా కోసం ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాలి.