ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ కేసు హై కోర్టులో నేడు మళ్లీ విచారణ... కీలక పరిణామంతో ప్రభాస్‌ హ్యాపీ  

  • రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన హైదరాబాద్‌ శివారులో ఉన్న గెస్ట్‌ హౌస్‌ను తెలంగాణ రెవిన్యూ అధికారులు సీజ్‌ చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. హైకోర్టులో పిటీషన్‌ వేయడంతో సీజ్‌ చేయడంపై స్టే విధించారు. దాంతో కాస్త ప్రభాస్‌కు ఊరట దక్కింది. ఇక తాజాగా విచారణ సందర్బంగా ప్రభాస్‌కు మరింతగా ఊరట కలిగింది అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ ఆయనకే వచ్చేలా కోర్టు తీర్పు వస్తుందని లాయర్లు ధీమాగా ఉన్నారు.

  • Prabhas Guest House Case Today Hearing From High Court-Prabhas Viral About

    Prabhas Guest House Case Today Hearing From High Court

  • నిన్నటి కోర్టు విచారణలో ప్రభాస్‌ తరపు లాయర్లు చాలా సంవత్సరా క్రితమే తమ క్లయింట్‌ తన భూమిని రెగ్యులర్‌ చేసేందుకు దరకాస్తు పెట్టుకున్నాడు. దాన్ని తిరష్కరించడం కాని, అంగీకరించడం కాని చేయకుండా పెండ్డింగ్‌లో పెట్టారు. ఆ కారణంగానే ఆ భూమిలో తమ క్లయింట్‌ గెస్ట్‌ హౌస్‌ను నిర్మించుకున్నాడని, దానికి సంబంధించిన పన్ను, కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లు అన్ని కూడా చెల్లిస్తున్నాడు. ఇన్ని చెల్లింపులు చేస్తున్న తర్వాత మళ్లీ గెస్ట్‌ హౌస్‌ను ఎలా సీజ్‌ చేస్తారంటూ లాయర్‌లు రెవిన్యూ సిబ్బందిని ప్రశ్నించారు.

  • Prabhas Guest House Case Today Hearing From High Court-Prabhas Viral About
  • ప్రభాస్‌ తరపు లాయర్ల వాదనతో హైకోర్టు దర్మాసనం ఏకీభవించింది. ప్రభాస్‌ పెట్టుకున్న పిటీషన్‌ను ఎందుకు కొట్టి పారేయకుండా పరిశీలనలో ఉంచారు. రెగ్యులరైజేషన్‌కు ఎందుకు గడువు పెట్టారు అంటూ రెవిన్యూ శాఖ తరపు లాయర్‌ను దర్మాసనం ప్రశ్నించింది. ఈనేపథ్యంలో పూర్తి వివరాలను ఒకరోజు గడువు కావాలంటూ రెవిన్యూశాఖకు చెందిన లాయర్‌ కోరడం జరిగింది. దాంతో కేసు నేటికి వాయిదా వేశారు. మళ్లీ నేడు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.