ఆమె దర్శకత్వంలో ప్రభాస్‌.. బాబోయ్‌ వద్దంటున్న ఫ్యాన్స్‌

ప్రభాస్‌ ది ప్రస్తుతం ఆల్‌ ఇండియా రేంజ్‌.బాలీవుడ్‌ స్టార్ లు సూపర్‌ స్టార్‌ లు కూడా ఆయన తర్వాతే అంటూ అభిమానులు అంటూ ఉంటారు.

 Prabhas Green Signal To Lady Director Sudha Kongara-TeluguStop.com

సౌత్‌ తో పాటు నార్త్‌ లో విశేషంగా అభిమానులను దక్కించుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా ల సంఖ్య భారీగానే ఉంది.బాలీవుడ్‌ కోసం కోలీవుడ్‌ టాలీవుడ్‌ మరియు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు ఆయనతో వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఆయన ఒక లేడీ డైరెక్టర్‌ కు ఓకే చెప్పాడు అంటూ వస్తున్న వార్తల పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చాలా మంది ఆ పుకార్లను నమ్మేందుకు సిద్దంగా లేరు.

 Prabhas Green Signal To Lady Director Sudha Kongara-ఆమె దర్శకత్వంలో ప్రభాస్‌.. బాబోయ్‌ వద్దంటున్న ఫ్యాన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కొందరు మాత్రం బాబోయ్‌ వద్దు అంటూ ఆ సినిమా ను మొదటి నుండే తిరష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంతకు ఆ లేడీ డైరెక్టర్‌ ఎవరు అంటే సుధా కొంగర.

కొన్ని రోజుల క్రితం ఆన్‌ లైన్‌ ద్వారా ఆమె ప్రభాస్‌ కు కథ వినిపించిందనే వార్తలు వస్తున్నాయి.

ఆకాశమే నీ హద్దుగా అనే సినిమా తో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుధా కొంగర త్వరలోనే ఒక స్టార్‌ హీరోతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

అది కాకుండా ప్రభాస్‌ తో కూడా సినిమా ను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ ను సుధా కొంగర వినిపించిందట.

స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ రాబోయే మూడు సంవత్సరాల వరకు బిజీగా ఉన్నాడు.

ఆయనతో సినిమా చేయాలంటే 2024 వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.మరి అప్పటి వరకు సుధా కొంగర వెయిట్‌ చేస్తుందా అనేది చూడాలి.సుధా కొంగర వంటి లేడీ డైరెక్టర్‌ కు ప్రభాస్‌ ఓకే చెప్పాడు అంటే ఆమె వద్ద ఉన్న స్టోరీ ఎంతగా ఆయనకు నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

#Adipurush #AkashameNee #PrabhasAnd #Lady Director #Tamil Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు