ఆదిపురుష్‌ షూటింగ్‌కు ముందు ప్రభాస్‌ ఏం చేయబోతున్నాడంటే!  

ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మరి కొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది.ఒకటి రెండు వారాల్లోనే సినిమా షూటింగ్‌ కు పేకప్‌ చెప్పబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

TeluguStop.com - Prabhas Going To Take One Month Break For Adipurush Movie Shooting For Fitness

మొత్తానికి అయితే డిసెంబర్‌లో రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టడం ఖాయం.వెంటనే ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటాడు అంటూ వార్తలు వచ్చాయి.

కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్‌ మూవీ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే కాకుండా నెల రోజుల పాటు గ్యాప్‌ తీసుకుని ఆ తర్వాత సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు.ఫిబ్రవరి లో ఆదిపురుష్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అవుతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

TeluguStop.com - ఆదిపురుష్‌ షూటింగ్‌కు ముందు ప్రభాస్‌ ఏం చేయబోతున్నాడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నెల రోజుల గ్యాప్‌ లో దర్శకుడు ఓం రౌత్‌ సూచన మేరకు ప్రభాస్‌ పూర్తిగా వర్కౌట్స్‌ చేయబోతున్నాడు.

శ్రీరాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించబోతున్నాడు.ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా రాముడు కనిపించని విధంగా వైవిధ్యభరితంగా కనిపించబోతున్నాడు.ఇప్పటి వరకు రాముడు అంటే నీలమేఘ శ్యాముడు అనే టాక్‌ ఉంది.

కాని ఇప్పుడు మాత్రం ఆ మాట మారబోతుంది అనిపిస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ వెయిట్‌ లాస్‌ అవ్వడంతో పాటు సిక్స్‌ ప్యాక్‌ ను ట్రై చేయబోతున్నాడట.

షూటింగ్‌ జరిగే మొత్తం ఆరు నెలలు కూడా సిక్స్‌ ప్యాక్‌ తో కనిపించబోతున్నాడు.ఈ సినిమా కోసం ప్రభాస్‌ విలు విద్యను కూడా నేర్చుకోబోతున్నాడు.

రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కోసం దర్శకుడు సెట్స్‌ ను వేయిస్తున్నాడు.భారీ అటవి సెట్‌ తో పాటు ఒక భారీ నగరం సెట్‌ ను కూడా వేయబోతున్నారు.2022 ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.హీరోయిన్‌ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

#Prabhas #Om Routh #Radheshyam #Adipurush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు