తన ట్రైనర్‌కు రేంజ్‌ రోవర్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్‌

ప్రభాస్‌ అసలు పేరు ప్రభాస్‌ రాజు అనే విషయం తెల్సిందే.రాజుల వంశంకు చెందిన వారు చాలా మంది చేతికి బొక్క పడిందా అన్నంతగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు.

 Prabhas Gifts A Range Rover Car To Gym Trainer, Gym Trainer, Range Rover Car, Su-TeluguStop.com

ఇక ప్రభాస్‌ దాన గుణం కూడా అలాగే ఉంటుంది.తన స్టార్‌ డంకు తగ్గట్లుగా కోట్లలో దానాలు చేయడం ప్రభాస్‌ కే చెల్లింది.

గతంలో ఎన్నో సార్లు ప్రభాస్‌ చేసిన మంచి పనుల గురించి మనం వింటూ వస్తున్నాం.ఇప్పుడు మరో సారి ప్రభాస్‌ భారీ గుణం గురించి తెలిసి వచ్చింది.

ఆయన తన ట్రైనర్‌కు ఏకంగా రేంజ్‌ రోవర్‌ గిప్ట్‌ గా ఇవ్వడం జరిగింది.

తన వద్ద చాలా కాలంగా వ్యక్తిగత జిమ్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్‌ రెడ్డి అనే వ్యక్తికి ప్రభాస్‌ సర్‌ ప్రైజ్‌గా 75 లక్షలకు మించి ఖర్చు చేసి రేంజ్‌ రోవర్‌ను కొని ఇచ్చాడు.

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో ఇంకా చాలా మందికి రేంజ్‌ రోవర్‌ లేదు.ఆ కారు ఉంటే అదో పెద్ద స్టేటస్‌ గా చెప్పుకుంటూ ఉంటారు.అలాంటిది అంత ఖరీదైన కారును ప్రభాస్‌ గిఫ్ట్‌గా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభాస్‌ బాహుబలి సినిమాలో అద్బుతమైన ఫిజిక్‌తో కనిపించాడు అంటే అందుకు కారణం లక్ష్మణ్‌ రెడ్డి అనే టాక్‌ ఉంది.

ఇక ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్‌ మరియు త్వరలో చేయబోతున్న ఆదిపురుష్‌లకు తగ్గట్లుగా ఫిజిక్‌ ను మెయింటెన్‌ చేయాలంటే లక్ష్మణ్ రెడ్డి బాధ్యత చాలానే ఉంటుంది.ప్రభాస్‌ తో పాటు అతడు కూడా చాలానే కష్టపడతాడట.

అందుకే ఈస్థాయిలో సర్‌ ప్రైజ్‌ బహుమానంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube