ఇన్ స్టాలో ప్రభాస్ ఫాలో అవుతున్న ఐదుగురు సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

Prabhas Followers In Insta

ప్రభాస్. క్రిష్ణం రాజు నట వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.

 Prabhas Followers In Insta-TeluguStop.com

పెదనాన్నను మించిన సినిమాలు చేస్తూ అద్భుత నటుడిగా గుర్తింపు పొందాడు.తెలుగు సినిమా పరిశ్రమలో ఛత్రపతి సినిమాలో కనీవినీ ఎరుగని నటనతో ఓ రేంజికి వెళ్లిపోయాడు.

ఇక అదే సినిమా దర్శకుడు తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ బాహుబలితో ఇండియన్ సినిమా పరిశ్రమలో తిరుగులేని నటుడిగా మారిపోయాడు.అంతే కాదు తన మార్కెట్ ను దేశ వ్యాప్తంగా భారీగా పెంచుకున్నాడు.

 Prabhas Followers In Insta-ఇన్ స్టాలో ప్రభాస్ ఫాలో అవుతున్నసెలబ్రిటీలు ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాహో సినిమాతో మరింత పాపులారిటీ సాధించిన ఈ హీరో.ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ సైతం ఎండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అటు ప్రభాస్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించడు.కానీ ప్రస్తుతం కాస్త సోషల్ మీడియా మీద ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.తాజాగా ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో కొంతమందిని ఫాలో అవుతున్నాడు.

అందులో స్టార్ హీరోయిన్స్ ఉన్నారు.ఒకరు సీనియర్ హీరోయిన్ ఉన్నారు.

బాలీవుడ్ సెలబ్రిటీస్ , మరో దర్శకుడు ఉన్నాడు.ఇంతకీవారెవరో కాదు.

స్టార్ హీరోయిన్లు శ్రద్దా కపూర్, పూజా హెగ్డే, దీపికా పదుకొనే, అమితాబ్, శృతి హాసన్, కృతి సనన్ బాలీవుడ్ నటులు ఉన్నారు.సీనియర్ నటి భాగ్య శ్రీ.

మరో వ్యక్తి సాహో దర్శకుడు సుజీత్ .

శ్రద్ధా కపూర్ ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో నటించింది.ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తాజా సినిమా రాధే శ్యామ్ లో హీరోయిన్ గా నటిస్తుంది.అటు ప్రభాస్ 21వ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక అయ్యింది దీపికా పదుకొనే.

నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ప్రభాస్ కి జంటగా దీపికను ప్రకటించిన సందర్భం నుంచి వీరిద్దరు ఇన్ స్టాలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు.అటు సోషల్ మీడియాలో ప్రభాస్ కు భారీగానే ఫాలోయింగ్ ఉంది.

తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయనకు నెమ్మదిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది.

#Salaar #Prabhas #Radheshyam #YoungRebel #Kriti Sanon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube