జాన్‌లో పాతదే హైలైట్ అట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.సాహో తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల వారు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

 Prabhas Flashback Look To Be Highlight-TeluguStop.com

జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పోషించే పాత్రకు సంబంధించిన గెటప్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఈ వార్త ప్రకారం ప్రభాస్‌కు సంబంధించి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే గెటప్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తాడని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాస్ లుక్ కేక ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను నాలుగు భాషల్లో తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube