డ్రామాలు దొబ్బకండంటూ పూరీ కొడుకుపై ప్రభాస్ ఫైర్.. కారణం?

Prabhas Fires On Puris Son

వరుస పాన్ ఇండియా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉండే రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేంటి ఎప్పుడూ ఎంతో కూల్ గా డార్లింగ్ అంటూ అందరినీ పలకరించే ప్రభాస్ కి కోపం వచ్చిందా?ఇండస్ట్రీలో ఎంతో కూల్ గా ఉండే పర్సన్ ప్రభాస్ అలాంటి ప్రభాస్ కి కోపం తెప్పించిన విషయం ఏమిటి అనే విషయానికి వస్తే.

 Prabhas Fires On Puris Son-TeluguStop.com

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ బుజ్జిగాడు ఏక్ నిరంజన్ వంటి చిత్రాలను చేశారు.

అప్పటి నుంచి ప్రభాస్ కు పూరి జగన్నాథ్ కు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పవచ్చు.ఇంత సాన్నిహిత్యం ఉన్న ప్రభాస్ తన కొడుకు పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటంటే.

 Prabhas Fires On Puris Son-డ్రామాలు దొబ్బకండంటూ పూరీ కొడుకుపై ప్రభాస్ ఫైర్.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి కేతికశర్మ జంటగా నటిస్తున్న చిత్రంరొమాంటిక్ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.

Telugu Akashpuri, Prabhas, Puri Jagannadh, Tolywood-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేస్తూ ఆకాష్ పూరి, కేతిక శర్మను ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా రొమాంటిక్ సినిమా గోవా షూటింగ్ జరిగినప్పుడు ఏమనిపించిందని ప్రభాస్ అడగడంతో అందుకు ఆకాశ్ అసలు షూటింగ్ తో బిజీగా ఉన్నాము ఖాళీ సమయం దొరకలేదు అని సమాధానం చెప్పుకొచ్చారు.

అలాగే గోవాలో ఎక్కడ నాన్ వెజ్ బాగుంటుంది అనే విషయానికి వచ్చేసరికి ఆకాష్ ఏ హోటల్ లో నాన్ వెజ్ బాగుంటుందో వివరించాడు.ఈ విషయం విన్న ప్రభాస్ డ్రామాలు దొబ్బకండి.ఇందాక అడిగితే షూటింగ్ లో బిజీగా ఉన్నామని చెప్పారు.ఇప్పుడేంటి ఇలా అన్నీ చెప్పేస్తున్నారు అంటూ వారిపై తమాషాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకరొమాంటిక్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం కావాలని ప్రభాస్ తెలియజేశారు.

#Puri Jagannadh #AkashPuri #Tolywood #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube