దీపిక వల్ల లేట్ అవ్వనున్న ప్రభాస్ సినిమా.. కారణం అదే!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న సినిమాకు అదిలోనే అంటకం ఎదురైంది.ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించబోతుందని గతంలో చిత్ర యూనిట్ పెర్కొంది అయితే ఇప్పుడు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది.

 Prabhas, Deepika Padukone, Naga Ashwin, Hruthik Roshan, Fighter Film-TeluguStop.com

దీంతో సందిగ్ధంలో పడ్డ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంపై మరో ఆలోచన చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేయాలి భావిస్తు్న్నాడు.
దీపిక ప్రస్తుతం ఈ మూవీ చేయకపోవడానికి బలమైన కారణం ఉంది.ప్రభాస్ సినిమాకు డెట్స్ ఇస్తే తన అంతకుముందు ఒప్పుకున్న హృతిక్ ఫైటర్ చిత్రం షూటింగ్‌లో పాల్గోనడం ఇబ్బంది అవుతుందని భావించిందట.

అందుకే ప్రభాస్ మూవీకి నో చెప్పిందని తెలుస్తో్ంది.దీంతో ఎలాగైన దీపికనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాలనే పట్టుదలతో ఉన్న నాగ్ ఆశ్విన్.ఆమెకు డెట్స్ ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నడంటా.

Telugu Fighter, Hruthik Roshan, Naga Ashwin, Prabhas-Movie

ఈ సినిమాలోని పాత్రకు దీపికా తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా నమ్ముతున్న నాగ్ అశ్విన్ ఆమె కోసం ఇంతగా వెయిట్ చేస్తున్నాడు.ఈ మధ్య దీపికను కలిసిన ఆశ్విన్ ఈ ఏడాది చివరికైనా డేట్లను అడ్జెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నించాలని ఆమెకు చెప్పాడట.దీంతో అతని నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన దీపికా అందుకు ఓకే చెప్పినట్లు టాక్.

దీంతో ఆశ్విన్, ప్రభాస్ మూవీ మరికొన్ని రోజులు వాయిదా పడనుంది.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనుంది.

అలాగే ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా నటించనున్నారు.మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు.

టాలీవుడ్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న సలార్ సినిమా శుక్రవారం లాంచ్ అయింది.

ఇక పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube