పండుగకు 'ఆదిపురుష్' నుండి అదిరే ట్రీట్.. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) చేస్తున్న సినిమాలకు భారీ డిమాండ్ ఉంది.ఈయన సినిమా అంటే నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ పెట్టడానికి క్యూ కడుతున్నారు.

 Prabhas Fans Want Promotions For Adipurush, Adipurush, Prabhas, Adipurush Update-TeluguStop.com

బాహుబలి( Bahubali ) సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం రేసులో వెనక్కి నెట్టాడు.మరి ఈ సినిమా తర్వాత ఒకేసారి ఐదారు పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెట్టాడు.

ప్రెజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్‘( Adipurush ) ఒకటి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించాడు.రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్( Kriti Sanon ) సీతగా నటించింది.

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా. సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.మంచి అంచనాలు పెరిగిన సమయం లోనే టీజర్ వచ్చి ఈ సినిమాపై ఆడియెన్స్ లో నిరాశ కలిగేలా చేసింది.

అప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఓం రౌత్ పై గుర్రుగా ఉన్నారు.దీంతో రిలీజ్ సైతం వాయిదా పడింది.ఇక కొత్త రిలీజ్ డేట్ ను జూన్ 16కు మార్చారు.

మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.అయితే మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తూ కంగారు పడుతున్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ రామనవమి రోజు నుండి స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

అదిరే ట్రీట్ తో స్టార్ట్ చేస్తారని టాక్ రావడంతో ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube