ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మరొకసారి మొదలైన చర్చ..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

 Prabhas Fans Keep Radhe Shyam Trending On Twitter, Prabhas, Radhe Shyam, Fans, S-TeluguStop.com

ప్రభాస్ వరసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

అందులో రాధే శ్యామ్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఎంత ఓపికగా ఎదురు చుసిన రాధేశ్యామ్ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఇప్పటి వరకు సినిమా నుండి విజువల్ గ్లిమ్స్ ఒక్కటి కూడా రాలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నాడు.ఆ అసంతృప్తిని ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు.

ఇంకా సినిమా ఎంత మేరకు పూర్తి అవ్వాలో అసలు ఎప్పుడు అవుతుందో అనేది మేకర్స్ ఇప్పటి వరకు ఏ అప్డేట్ ఇవ్వలేదు.అందులో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కూడా జరిగే పరిస్థితి లేదు.

అందుకే జులై లో విడుదల కావాల్సిన రాధేశ్యామ్ సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి.వీటన్నిటిని ఆలోచిస్తూ ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

అదే నిరాశ సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు.ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేకపోయినా రాధే శ్యామ్ ను ట్రెండింగ్ లో ఉండేలా చేస్తున్నారు.

ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్స్ లో రాధేశ్యామ్ ఉండేలా ఫ్యాన్స్ చేయడంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ స్టామినా గురించి సర్వత్రా ఆశ్చర్యంతో పాటు చర్చ కూడా చేసుకుజుంటున్నారు.మరి చూడాలి మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశను చూసి ఇప్పటికైనా అప్డేట్ ఇస్తారో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube