బొమ్మరిల్లు సిద్దుపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. అసలేం అన్నాడో తెలుసా     2018-07-18   11:37:21  IST  Ramesh Palla

ఈమద్య హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తమ హీరోకు సంబంధించిన విషయాలపై ట్వీట్స్‌ చేస్తూ ట్రెండ్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి హీరో అభిమానులు కూడా తమ అభిమాన హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్స్‌ చేయడం చాలా కామన్‌ అయ్యింది. హీరోల బర్త్‌డేలు, హీరోల హిట్‌ సినిమాలకు ఇన్ని సంవత్సరాలు అయ్యింది అంటూ ఎప్పటికప్పుడు తమ హీరోకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యేలా అభిమాను చూస్తూ ఉంటారు. తాజాగా ప్రభాస్‌ పుట్టిన రోజుకు ఇంకా 100 రోజులు అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను షురూ చేయడం జరిగింది.

ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా కూడా ప్రభాస్‌ బర్త్‌డే 100 రోజులు అంటూ హ్యాష్‌ ట్యాప్‌ పోస్ట్‌ చేయడం జరిగింది. ఆయన పోస్ట్‌కు భారీ ఎత్తున రెస్పాన్స్‌ దక్కింది. రమేష్‌ బాలా ట్వీట్‌పై తమిళ హీరో సిద్దార్థ్‌ వింతగా స్పందించాడు. వంద రోజులు ఉండగానే ఇలాంటి హ్యాష్‌ ట్యాగ్‌ ఏంటీ అన్నట్లుగా ఎటకారంగా ఆ తర్వాత బర్త్‌డేకు 465 రోజులు అన్నట్లుగా పోస్ట్‌ చేశాడు. వంద రోజుల ముందే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవ్వడం ఏంటన్నట్లుగా ఆయన ఎటకారం. సిద్దార్థ ఎటకారంపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

Prabhas Fans Fire On Bommarillu Sidhu-

Prabhas Fans Fire On Bommarillu Sidhu

పలువురు సిద్దార్థపై ట్విట్టర్‌లో దూషణల పర్వ కొనసాగించారు. సినిమాలు లేక ఊరికే ఉంటే ఇలాంటి ఎటకారాలు ఎక్కువ అవుతాయని, సినిమాలు మానేసి ఏదైనా చిల్లర వ్యాపారం పెట్టుకో అంటూ కొంతమంది ఇలా రకరకాలుగా బొమ్మరిల్లు సిద్దుకు చుక్కలు చూపించారు. దాంతో చివరకు సిద్దు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒక అభిమాని పెట్టిన ట్వీట్‌కు స్పందనగా సిద్దు తన వివరణ ఇచ్చాడు.

ప్రభాస్‌ నీకు స్నేహితుడే కదా, ఎందుకు ఈ వెటకారం సిద్దు అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా సమాధానంగా సిద్దు స్పందిస్తూ.. ప్రభాస్‌ నా స్నేహితుడు కాబట్టే అలా మాట్లాడాను, స్నేహితుడు అవ్వడం వల్లే ఫ్రీడం తీసుకుని ఆ పోస్ట్‌ పెట్టాను, డార్లింగ్‌ ప్రభాస్‌ కూడా తప్పకుండా నవ్వుకుంటాడు అనే నమ్మకం తనకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. సిద్దు వివరణ ఇచ్చినప్పటికి కూడా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ట్రోలింగ్‌ ఆపడం లేదు. ఇక ఎప్పటికి సిద్దుపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ వార్‌ కొనసాగిస్తూనే ఉంటారు. ప్రభాస్‌ గురించి అనవసరంగా గెలిచి సిద్దు తప్పు చేశాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.