కేజీఎఫ్2 కేవలం ట్రైలర్ మాత్రమే అంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్

యావత్ సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 టీజర్ ఎట్టకేలకు రిలీజ్ కావడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాను దున్నేస్తుంది.ఈ టీజర్‌లోని మాస్ అంశాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాయి.

 Prabhas Fans Excited On Prabhas Elevations In Salaar, Prabhas, Kgf2, Salaar, Pra-TeluguStop.com

ముఖ్యంగా హీరో యష్ ఎలివేషన్ ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.ఇక ఈ టీజర్ సృష్టిస్తున్న ప్రభంజనంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

కేజీఎఫ్ టీజర్ రికార్డులు క్రేయేట్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఏమిటనుకుంటున్నారా? అయితే అసలు కథ చదవాల్సిందే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను దర్శకుడు నాగ్ అశ్విన్, ఓం రావుత్, ప్రశాంత్ నీల్‌లతో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్‌ను దర్శకుడు ఎలా చూపిస్తాడా అనే ప్రశ్నకు తాజాగా కేజీఎఫ్ 2 టీజర్ సమాధానం ఇచ్చేసింది.కేజీఎఫ్-2లో హీరో యష్‌ను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుండటంతో, సలార్ చిత్రంలో ప్రభాస్ ఎలివేషన్ అంతకు మించి ఉంటుందని వారు అంటున్నారు.
కేజీఎఫ్-2లో హీరోను చూపించిన విధానం కేవలం ట్రైలర్ మాత్రమేనని, సలార్ చిత్రంలో ప్రభాస్ ఎలివేషన్స్ ప్రతిఒక్కరికి గూస్‌బంప్స్ తీసుకొస్తాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ లుక్‌ను ఇప్పటికే రివీల్ చేసిన ప్రశాంత్ నీల్, ఆయన ఎలివేషన్స్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తాడో అవి అందరి ఊహలకే వదిలేస్తున్నామని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఏదేమైనా కేజీఎఫ్-2 టీజర్‌లో యష్‌ను ఎలివేట్ చేసిన విధానం అందరినీ నోరెళ్లబెట్టేలా చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ కోసం ఇప్పటినుండే గూస్‌బంప్స్ తెచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube