వకీల్ సాబ్ దెబ్బకు మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్  

Prabhas Fans Eagerly Waiting To Beat Pspk26 Record - Telugu Jaan, Prabhas, Pspk26, Pspk26 First Look, Telugu Movie News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26వ చిత్రంగా వస్తున్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రలీజ్ చేయగా అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.కేవలం 24 గంటల్లోనే ఈ ఫస్ట్ లుక్‌ 3.5 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది.ఇక పవన్ ఫ్యాన్స్ చేసిన ఈ రచ్చ సోషల్ మీడియాలో ఎలాంటి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

Prabhas Fans Eagerly Waiting To Beat Pspk26 Record

పవన్ ఫ్యాన్స్ నెలకొల్పిన ఈ అద్భుతమైన రికార్డుతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మండిపడుతున్నారు.అయితే వారు మండి పడుతుంది పవన్ ఫస్ట్ లుక్‌పై కాదు.

తమ అభిమాన హీరో ప్రభాస్ తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.జాన్ సినిమా ఫస్ట్ లుక్‌ను వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రికార్డులను తాము బద్దలు కొడతామని అంటున్నారు.

మరి ప్రభాస్ తన ఫ్యాన్స్ కోరికను ఎప్పుడు తీరుస్తాడా అని సినీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.అటు పవన్ ఫ్యాన్స్ కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఇలాంటి థండర్ క్రియేట్ చేయడంతో, ఆ సినిమా టీజర్, ట్రైలర్లతో ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి పవన్ ఫస్ట్ లుక్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను మండిపడేలా చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు