రగిలి పోతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..తీవ్ర స్థాయిలో విమర్శలు   Prabhas Fans Eagerly Waiting For Sahoo Movie Teaser     2018-10-20   10:43:38  IST  Ramesh P

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దసరా కానుక లేకపోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్‌ అంతా కూడా తమ హీరోలకు సంబంధించిన సినిమాలు, ఇతరత్ర లుక్‌లు, వీడియోలతో ఎంజాయ్‌ చేస్తే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఎప్పటిలాగే నిరాశగా దసరాను కానిచ్చేశారు. ‘బాహుబలి’ చిత్రం చేస్తున్నంత కాలం ఒక గొప్ప సినిమాను ప్రభాస్‌ చేస్తున్నాడు కనుక, ఎదురు చూద్దాం అంటూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూశారు. కాని ఇప్పుడు ‘సాహో’ విషయంలో మాత్రం అలా ఎదురు చూడలేక పోతున్నారు.

‘సాహో’ నుండి పోస్టర్‌ లేదా వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్‌ ఎదురు చూశారు. దసరా కానుకగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఏదైనా సర్‌ప్రైజ్‌ ఉంటుందని భావించారు. కాని యూవీ క్రియేషన్స్‌ నుండి ఎలాంటి హడావుడి ప్రకటన లేదు. ఎక్కడ కూడా సందడి కనిపించకుండా ‘సాహో’ చిత్ర యూనిట్‌ సభ్యులు దసరాను పూర్తి చేశారు. ‘సాహో’ చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సాహో టీజర్‌ను విడుదల చేస్తే బాగుంటుంది కదా అంటూ అంతా అనుకున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ‘సాహో’ ఫస్ట్‌లుక్‌ను త్వరలో రాబోతున్న ప్రభాస్‌ పుట్టిన రోజున విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. పుట్టిన రోజు ఈనెల 23న జరుపుకోబోతున్న ప్రభాస్‌ ఖచ్చితంగా ఆరోజు మాత్రం సర్‌ప్రైజ్‌ ఇస్తాడనే టాక్‌ వినిపిస్తుంది. ఒక వేళ పుట్టిన రోజున కూడా ఫ్యాన్స్‌ను నిరాశ పర్చితే మాత్రం యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది.

Prabhas Fans Eagerly Waiting For Sahoo Movie Teaser-

ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను కూడా ప్రభాస్‌ చేస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు ఆ సినిమా ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంది. సాహో చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుండగా, ప్రభాస్‌ మరో సినిమా వచ్చే దసరాకు విడుదల అయ్యే అవకాశాలున్నాయి.