ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్న ప్రభాస్.. ఏం జరిగిందంటే..?

బాహుబలి, బాహుబలి 2 సినిమాల విజయాలతో కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రభాస్ అక్కడి స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇతర ఇండస్ట్రీలలో సైతం కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

 Prabhas Fans Demands Atleast A Movie In Year, Radhe Shyam, Aadi Purush, Nag Ashw-TeluguStop.com

గతేడాది ప్రభాస్ నటించిన సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా ఆ సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయంటే ప్రభాస్ కు ఉన్న క్రేజే కారణం.

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.పునర్జన్మల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రభాస్ తరువాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఒక సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒక విషయంలో ప్రభాస్ తమను కొంత హర్ట్ చేస్తున్నాడని చెబుతున్నారు.

మిగతా స్టార్ హీరోలు వేగంగా సినిమాలు విడుదల చేస్తుంటే ప్రభాస్ ఒక సినిమా విడుదలకు మరో సినిమా విడుదలకు చాలా సమయం పడుతోందని కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.గడిచిన ఏడేళ్లలో ప్రభాస్ నటించిన మూడు సినిమాలే విడుదలయ్యాయని చెబుతున్నారు.

మరికొందరు అభిమానులు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని తమ హీరో పెళ్లి వార్త వినాలని ఆశగా ఉందని అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ అభిమానులకు పెళ్లి శుభవార్త ఎప్పుడు చెబుతాడో చూడాల్సి ఉంది.

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube