ప్రభాస్ కుటుంబం గొప్పదనం ఇదే.. పనిమనిషికి సన్మానం చేస్తూ?

Prabhas Family Thanks To Her Servant Padma For 25 Years Of Service

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద సులభంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయి.

 Prabhas Family Thanks To Her Servant Padma For 25 Years Of Service-TeluguStop.com

ప్రభాస్ చేసే అతిథి మర్యాదల గురించి చాలామంది సెలబ్రిటీలు గొప్పగా చెప్పుకొచ్చారు.పెదనాన్న కృష్ణంరాజు నుంచే ప్రభాస్ కు ఈ అలవాట్లు వచ్చాయని ప్రభాస్ అభిమానులలో చాలామంది భావిస్తారు.

ప్రభాస్ కుటుంబంతో అనుబంధం ఉన్నవాళ్లు సైతం వాళ్లు చాలా మంచివాళ్లని చెబుతారు.

 Prabhas Family Thanks To Her Servant Padma For 25 Years Of Service-ప్రభాస్ కుటుంబం గొప్పదనం ఇదే.. పనిమనిషికి సన్మానం చేస్తూ-Latest News English-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంతమంది హీరోయిన్లు ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడంటూ సరదాగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

ఇంటికి వచ్చే అతిథులకు భారీస్థాయిలో మర్యాదలు చేసే ప్రభాస్ ఫ్యామిలీ ఇంట్లో పనిచేసే వాళ్లను ఏ విధంగా చూసుకుంటారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ ఫ్యామిలీ పనివాళ్లను సైతం ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటారు.

తాజాగా ప్రభాస్ ఫ్యామిలీ పనిమనిషికి సన్మానం చేయడం గమనార్హం.

కృష్ణంరాజు ఇంట్లో గత 25 సంవత్సరాలుగా పద్మ అనే మహిళ పని చేస్తున్నారు.పద్మ ఎంతో నమ్మకంగా ఉంటూ కృష్ణంరాజు కుటుంబ సభ్యుల బాగోగులను సైతం చూసుకున్నారు.పద్మ పనిలో చేరి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం గమనార్హం.

కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పద్మ చేత కేక్ కట్ చేయించి కృతజ్ఞతలు తెలిపారు.

కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి పద్మకు గోల్డ్ చెయిన్ ను బహుమతిగా ఇచ్చారు.ప్రభాస్ సోదరి ప్రసీద పద్మకు థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో మూడు సినిమాలు 2022 సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి.

#Prabhas Family #Prabhas #Shyamala #Padma #Maid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube