ప్రభాస్ అలాంటివి అస్సలు ఇష్ట పడడు... కానీ సినిమాల్లో మాత్రం... 

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్  ఫాలోయింగ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు ప్రభాస్ “బాహుబలి” చిత్రంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేశాడు.

 Prabhas Costume Designer Bhaskar Revealed About Prabhas Diet And Costumes-TeluguStop.com

అంతేకాక ఆ తరువాత ప్రభాస్ హీరోగా నటించిన “సాహో” చిత్రంతో ఏకంగా హాలీవుడ్ చిత్ర రేంజ్ ని అందుకున్నాడు.దీంతో ప్రస్తుతం ప్రభాస్ కి టాలీవుడ్, బాలీవుడ్, తదితర చిత్ర పరిశ్రమలలో మార్కెట్ బాగా పెరిగింది.

దీంతో ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “ఓం రావత్” దర్శకత్వం వహిస్తున్న “ఆది పురుష్” చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో సన్నీ సింగ్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 Prabhas Costume Designer Bhaskar Revealed About Prabhas Diet And Costumes-ప్రభాస్ అలాంటివి అస్సలు ఇష్ట పడడు… కానీ సినిమాల్లో మాత్రం… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ప్రభాస్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా ప్రభాస్ కేవలం చిత్రాల్లో నటించేటప్పుడు మాత్రమే తన పాత్రకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ దరిస్తాడని కానీ సినిమా షూటింగులు పూర్తయిన తర్వాత మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడని తెలిపాడు.

కాగా గతంలో కూడా పలుమార్లు ఆడియో ఫంక్షన్లకి మరియు ఇతరాత్రా ఫంక్షన్లకి కి వెళ్ళినప్పుడు చాలా సింపుల్ గా ఉన్న దుస్తులనే డిజైన్ చేయమని తనతో చెప్పే వాడని తెలిపాడు.అయితే తన పాత్రకి తగ్గట్టుగా ప్రభాస్ తనని తాను మలుచుకుంటాడని, ఈ క్రమంలో బరువు పెరగాలన్నా లేదా తగ్గాలన్నా చాలా స్ట్రిక్ట్ ఆహారపు డైట్ ను పాటిస్తాడని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా సినిమా షూటింగుల సమయంలో టైమ్ మెయింటినెన్స్ కూడా బాగా పాటిస్తాడని అలాగే తోటి నటీనటులతో కూడా ఇట్టే కలిసిపోయి సినిమా సెట్లో అందరిని చాలా హుషారుగా పని చేసేలా ప్రోత్సహిస్తాడని తెలిపాడు.ఇక సినిమా షూటింగులు పూర్తయిన తర్వాత ప్రభాస్ రోజులో ఎక్కువ సమయాన్ని తిండి కోసమే కేటాయిస్తాడని, ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రముఖ రెస్టారెంట్ల నుంచి మంచి రుచికరమైన భోజనాలను తెప్పించుకొని తింటాడని ప్రభాస్ డైట్ గురించి భాస్కర్ తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.కే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యాం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు మొదలై రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేదు.

 దీంతో ప్రభాస్ అభిమానులు దర్శకుడు రాధా కృష్ణపై కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#PrabhasDiet #PrabhasCostume #Bahubali #Bhaskar #PrabhasCostume

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు