మహాసముద్రం ట్రైలర్ పై ప్రభాస్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా మహాసముద్రం

 Prabhas Comments About Maha Samudram Trailer-TeluguStop.com

ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.ఈ సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.

చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

 Prabhas Comments About Maha Samudram Trailer-మహాసముద్రం ట్రైలర్ పై ప్రభాస్ కామెంట్స్.. ఏమన్నాడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో కూడా మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక దసరా రేస్ లో రాబోతుంది.ఈ సినిమాను అక్టోబర్ 14న వరల్డ్ వైజ్ విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.

ఇక విడుదలకు ఇంకా సమయం ఉండగానే అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలో లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో విడుదల అయ్యి 6+ మిలియన్ వ్యూస్ తో 190+ లైక్స్ తో దూసుకు పోతుంది.

ఇక ఈ ట్రైలర్ పై తాజాగా యంగ్ రెబల్ ప్రభాస్ కామెంట్స్ చేసారు.

శర్వానంద్, ప్రభాస్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.శర్వానంద్ ప్రతి సినిమాకు ప్రభాస్ తన మద్దతు తెలుపుతాడు.ఇక తాజాగా మహా సముద్రం సినిమా ట్రైలర్ పై కూడా ప్రభాస్ కామెంట్స్ చేసాడు.

ఈ ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా ఆసక్తికరంగా ఉందని ప్రభాస్ చిత్ర యూనిట్ కు తెలిపారు.ఆయన ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలిపారు.

చిత్ర యూనిట్ కూడా ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలిపింది.శర్వా కూడా ‘థాంక్స్ అన్న‘ అంటూ ప్రభాస్ పోస్ట్ పై కామెంట్ చేసాడు.

#Sharwanand #Maha Samudram #Siddharth #October #PrabhasMaha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు