ఆది పురుష్ పాత్రల వరకే రామాయణం… కథ మొత్తం కొత్తదే  

Prabhas character in Adipurush is to be like Rama, Bollywood, Om Raut, Darling Prabhas, Adi Purush, Saif Ali Khan, T-series, Ramayanam - Telugu Adi Purush, Bollywood, Darling Prabhas, Om Raut, Prabhas Character In Adipurush Is To Be Like Rama, Ramayanam, Saif Ali Khan, T-series

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హిందీలో భారీ బడ్జెట్ తో ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్.ఈ సినిమాని టి-సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

TeluguStop.com - Prabhas Character In Adipurush Is To Be Like Rama

ఇక ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.మిగిలిన ఆర్టిస్ట్ ల ఎంపిక కొనసాగుతుంది.

పూర్తి త్రీడీ టెక్నాలజీ, గ్రీన్ మ్యాట్ స్టూడియోలో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.జనవరి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

TeluguStop.com - ఆది పురుష్ పాత్రల వరకే రామాయణం… కథ మొత్తం కొత్తదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనికోసం అరవై రోజులు ప్రభాస్ కాల్షీట్స్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఇన్ని రోజులుగా ఈ సినిమా రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కించబోతున్న సినిమా అనే ప్రచారం జరుగుతూ వచ్చింది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపిస్తాడని టాక్ నడుస్తుంది.రామాయణంలో కీలక ఘట్టం తీసుకొని ఆది పురుష్ సినిమాని ఆవిష్కరిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని, ఆది పురుష్ పూర్తి స్థాయిలో కొత్త కథ, కథనంతో నడిచే చిత్రం అని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో కేవలం రామాయణం కాలం నాటి పాత్రల స్వభావంతో అదే పేర్లుతో పాత్రలు డిజైన్ చేసి నేటి, కాలమాన పరిస్థితులకి తగ్గట్లు స్టోరీని సిద్ధం చేశారని, అలాగే రామాయణం ఇతివృత్తంని ఇందులో రిప్రజెంట్ చేసిన అది పూర్తిస్థాయిలో కొత్తకోణంలో చూపించబోతున్నారని చెప్పుకుంటున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే ఈ ఆది పురుష్ కథ ఆధునిక రామాయణం అని అంటున్నారు.ఇందులో లంకేశ్ అనే పేరుతో రావణుడుకి సింబాలిక్ పాత్ర, అలాగే రాముడుకి సింబాలిక్ పాత్రలలో ఆది పురుష్ పాత్రలు ఉంటాయని సమాచారం.

మైథాలజీ కథ రామాయణం నేరేషన్ ఇస్తూనే ఈ కథని సిమిలర్ గా నడిపిస్తారని చెప్పుకుంటున్నారు.మరి ఈ ఆది పురుష్ కథపై వినిపిస్తున్న వార్తలలో క్లారిటీ ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

.

#Adi Purush #T-Series #Darling Prabhas #Saif Ali Khan #Om Raut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Character In Adipurush Is To Be Like Rama Related Telugu News,Photos/Pics,Images..