ప్రభాస్ ని మాస్ కథతో మెప్పించిన బోయపాటి  

Prabhas-Boyapati combination Trending, Tollywood, Bollywood, Pan India Movie, Darling Prabhas, Boyapati Srinu, Nandamuri Balakrishna - Telugu Bollywood, Boyapati Srinu, Darling Prabhas, Nandamuri Balakrishna, Pan India Movie, Tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.ఆయనతో సినిమాలు చేయాలంటే దర్శకులు పాన్ ఇండియా కథలు సిద్ధం చేసుకోవాలి.

TeluguStop.com - Prabhas Boyapati Combination Trending

నిర్మాతలు అయితే ఓ రెండు, మూడు వందల కోట్లు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి.కేవలం ఒక భాషకే పరిమితం అయ్యే విధంగా ఉన్న కథలు తీసుకొని ప్రభాస్ తో సినిమాలు చేద్దామంటే ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్ లతో ఏకంగా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.వీటిని పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడు.

TeluguStop.com - ప్రభాస్ ని మాస్ కథతో మెప్పించిన బోయపాటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ వినిపిస్తుంది.అదేంటంటే బోయపాటి చెప్పిన ఓ పవర్ ఫుల్ మాస్ కథకి ప్రభాస్ కనెక్ట్ అయ్యాడని.

బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ఓ పవర్ ఫుల్ కథతో సినిమా చేస్తున్నాడు.ఇందులో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.బోయపాటి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

అతని సినిమాలు హిందీలో కూడా డబ్ అవుతూ అక్కడ ఒక వర్గం ప్రేక్షకులని అలరిస్తున్నాయి.అతని సినిమాలలో రక్తపాతం, కత్తులు ఎక్కువగా కనిపిస్తాయి.

అలాగే భారీ భారీ డైలాగ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి.పూర్తిగా తెలుగు నేటివిటీలోనే బోయపాటి కథలన్నీ ఉంటాయి.

మరి అలాంటి కథతో పాన్ ఇండియా మూవీ ప్రభాస్ తో చేయడం అంటే ఆలోచించాల్సిందే.అయితే ఓ బడా నిర్మాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

#Pan India Movie #Boyapati Srinu #Darling Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Boyapati Combination Trending Related Telugu News,Photos/Pics,Images..