ఆదిపురుష్‌ సినిమా విషయంలో పుకార్లే నిజం అయ్యాయా?

ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్‌ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది.సినిమా మెజార్టీ పార్ట్‌ బ్లూ మ్యాట్ పై షూటింగ్‌ జరుపుతున్నారు.

 Prabhas Bollywood Movie Adipurush Heroine News-TeluguStop.com

అందుకే తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా లో రాముడి పాత్రను ప్రభాస్‌ పోషిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.

ఇక సైఫ్‌ అలీ ఖాన్‌రావణుడిగా కనిపించబోతున్నాడు.ఈ రెండు పాత్రల విషయమై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు తదుపరి విషయాలపై ఇప్పటి వరకు సస్పెన్స్‌ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

 Prabhas Bollywood Movie Adipurush Heroine News-ఆదిపురుష్‌ సినిమా విషయంలో పుకార్లే నిజం అయ్యాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా లో సీత పాత్రను కృతి సనన్‌ ని ఎంపిక చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.నాలుగు నెలలుగా ప్రచారం మాత్రమే జరుగుతుంది.

కాని ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు.దాంతో ఆ పుకార్లు నిజం కాకపోవచ్చు అంటూ అంతా భావించారు.

బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో హీరోయిన్ గా ఆమెనే ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.గతంలో ఆమె త దర్శకుడు ఓం రౌత్‌ చర్చలు జరిపాడు.

ఆమె కూడా పాత్ర కు ఓకే చెప్పింది.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్నసమాచారం ప్రకారం కేవలం 30 రోజుల డేట్లు మాత్రమే ఆమె నుండి దర్శకుడు కోరాడట.

అంటే ఆమె పాత్ర తక్కువ ఉంటుందని తెలుస్తోంది.అందుకే హీరోయిన్ పాత్ర విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు అంటున్నారు.

ప్రభాస్‌ పై కొన్ని సీన్స్‌ ను ఇప్పటికే చిత్రీకరించారు.సైఫ్ అలీ ఖాన్ ఇంకా జాయిన్‌ అవ్వలేదు.

త్వరలోనే ఆయనపై కూడా సీన్స్‌ ను షూట్‌ చేయాలని అంటున్నారు.మొత్తానికి ఈ సినిమా షూటింగ్‌ విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న పుకార్లు అన్నింటికి చెక్‌ పెట్టే రోజు వస్తుందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

#Adipurush #Om Routh #Krithi Sanan #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు