ప్రభాస్‌ అభిమానుల ఆందోళన... గాలి బెలూన్‌ పగిలి పోదు కదా!

ప్రభాస్ బాహుబలి తర్వాత బాలీవుడ్‌ రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు.బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా బాలీవుడ్‌ లో ఆ సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.

 Prabhas Bollywood Craze In Going Very High-TeluguStop.com

దాంతో ప్రభాస్ కు బాలీవుడ్‌ లో ఆహా ఓహో అన్నట్లుగా అభిమానులు ఉన్నట్లుగా అంతా బలంగా నమ్ముతున్నారు.టాలీవుడ్‌ హీరోల అభిమానుల మాదిరిగా బాలీవుడ్‌ హీరోల అభిమానులు ఉంటారు అనుకుంటే పొరపాటే.

ఒక్కటి కాదు పది సినిమాలు ప్లాప్ అయినా కూడా టాలీవుడ్‌ హీరోల అభిమానులు తమ హీరో వెంటే ఉంటారు.కాని బాలీవుడ్‌లో మాత్రం అలా కాదు.

 Prabhas Bollywood Craze In Going Very High-ప్రభాస్‌ అభిమానుల ఆందోళన… గాలి బెలూన్‌ పగిలి పోదు కదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకటి రెండు సినిమాలతో విఫలం అయితే మళ్లీ ఆ హీరో వైపు చూసేందుకు ఆసక్తి చూపించరు.ఇప్పుడు అదే ప్రభాస్ అభిమానులకు కాస్త టెన్షన్‌ ను కలిగిస్తుంది.

బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ గా ప్రభాస్‌ వరుసగా భారీ చిత్రాలను చేస్తున్నాడు.

ఇప్పటి వరకు ఇకపై ఏ బాలీవుడ్‌ హీరోకు సైతం సాధ్యం కాని భారీ చిత్రాలను ప్రభాస్‌ చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాల ఖరీదు ఏకంగా మూడు వేల కోట్లకు పైమాటే.అవి విడుదల అయ్యే సమయంకు వాటి విలువ అయిదు వేల కోట్లకు పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

అంతగా ప్రభాస్ మీద భారం పెడితే ముందు ముందు కాస్త తేడా జరిగితే పరిస్థితి ఏంటీ అంటూ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ వరుస సినిమా లు సక్సెస్‌ అయితే పర్వాలేదు.

కాని అదృష్టం సరిగా లేక ఏ ఒక్క సినిమా అయినా ఫలితం తేడా కొడితే మళ్లీ ప్రభాస్‌ పరిస్థితి ఎక్కడకు చేరుతుందో ఆలోచిస్తేనే ఆందోళన కలుగుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ప్రభాస్ క్రేజ్‌ గాలి బెలూన్‌ మాదిరిగా భవిష్యత్తులో పగిలి పోదు కదా అంటూ కొందరు అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

#Adipurush #Radheshyam #Prabhas #Nag Aswhin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు