ప్రభాస్ బిల్లా కి నేటితో 11 ఏళ్ళు...

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి “బిల్లా” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టాడు.

 Young Rebal Star Prabhas, Krishnam Raju, Anushka Shetty, Namitha, Billa Movie Ne-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా మాఫియా మరియు డ్రగ్ డీలర్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీంతో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి అర్థం అయింది.

అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ అనుష్క శర్మ, కోలీవుడ్ బొద్దుగుమ్మ నమిత, గెస్ట్ అప్పియరెన్స్ లో హన్సిక హీరోయిన్లుగా నటించారు.

అలాగే ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించాడు.

అయితే ఈ చిత్రం 2009వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలోని 3వ తారీఖున విడుదలయింది.

దీంతో ఈ చిత్రం విడుదలై సరిగ్గా నేటితో 11 సంవత్సరాలు కావస్తోంది.అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించడమే కాక దర్శకనిర్మాతలు కూడా కాసుల వర్షం కురిపించింది.

అయితే ఈ చిత్రంలో మాఫియా డాన్ గా ప్రభాస్ చెప్పేటువంటి  డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Telugu Anushka Shetty, Billa, Mehar Ramesh, Krishnam Raju, Namitha, Youngrebal-M

ఈ చిత్రంలో మరోపక్క హీరోయిన్లు ఇద్దరూ బికినీలో అందాల ఆరబోతతో ఆకట్టుకోగా యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.దీనికితోడు అలీ కామెడీ సన్నివేశాలు కొంత మేర ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి.మొత్తానికి అప్పటి వరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న టువంటి ప్రభాస్ కి ఈ చిత్రం కొంతమేర ఊరట కలిగించింది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube