అలా జరిగితే టాలీవుడ్ లో రిచ్ హీరో ప్రభాసేనా.. ఆ విషయంలో పోటీనిచ్చే మరో హీరో లేరా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.తాజాగా ప్రభాస్ ఇకపై ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తానని అదే సమయంలో ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని మాటిచ్చారు.

 Prabhas Become Tollywood Rich Hero Details Here Goes Viral In Social Media , Pra-TeluguStop.com

ఈ ఏడాది వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

ప్రభాస్ త్వరలో మరో రెండు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం.

ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా( Sandeep reddy vanga, ) కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలోని టైర్1 హీరోలలో మరే హీరో ఇంత వేగంగా సినిమాలు చేయడం లేదు.

రెమ్యునరేషన్ల ద్వారా ప్రభాస్ ఏడాదికి సులువుగా 300 కోట్ల రూపాయల స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.

Telugu Salaar, Adiprurush, Bollywood, Prabhas, Rich, Sandeepreddy, Tollywood-Mov

ప్రభాస్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం వల్ల ఇండస్ట్రీకి సైతం మేలు జరుగుతోంది.ప్రభాస్ నటించిన సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తుండటం గమనర్హం.ప్రభాస్ సినిమాలకు బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ప్రభాస్ సినిమాల హక్కుల బడ్జెట్ రికవరీ అవుతుండటం గమనార్హం.

Telugu Salaar, Adiprurush, Bollywood, Prabhas, Rich, Sandeepreddy, Tollywood-Mov

ప్రభాస్ ఏడాదికి 300 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లు సంపాదించినా ప్రభాస్ టాలీవుడ్ రిచ్ హీరో అవుతారని చెప్పవచ్చు.స్పీడ్ విషయంలో ప్రభాస్ కు పోటీనిచ్చే మరో స్టార్ హీరో కూడా లేరనే సంగతి తెలిసిందే.సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ ( Salaar )సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.కొన్ని నెలల గ్యాప్ లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube