ప్రభాస్‌ అత్యాశ చేటు చేస్తుందేమో!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.ఆ నాలుగు సినిమాల విలువ ఏకంగా రూ.1500 కోట్లుగా చెబుతున్నారు.వాటి బిజినెస్‌ మినిమం 2500 కోట్ల రూపాయలు అవ్వబోతున్నాయి.

 Is Prabhas Back To Back 4 Movies Going Wrong ,prabhas Back To Back Movies, Adipu-TeluguStop.com

ఇండియాలో ఇంత భారీగా సినిమాలు చేస్తున్న హీరో మరెవ్వరు లేరు.మిర్చి తర్వాత బాహుబలి సినిమా కోసం అయిదు సంవత్సరాలు సమయం తీసుకున్న ప్రభాస్‌ సాహోకు కూడా దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు తీసుకున్నాడు.

రాధేశ్యామ్‌ కోసం కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.కాని తదుపరి సినిమాల విషయంలో మాత్రం అలా చేయకూడదనే నిర్ణయానికి ప్రభాస్‌ వచ్చినట్లుగా అనిపిస్తుంది.

ఈమద్య కాలంలో ఏ ఒక్క హీరో కూడా ఏక కాలంలో రెండు మూడు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఏదో తప్పని సరి పరిస్థితులు వస్తే తప్ప ఒక సినిమా చేస్తూ మరో సినిమాను చేయడం లేదు.

ఒకటి పూర్తి అయిన తర్వాత ఒకటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.కాని ప్రభాస్‌ మాత్రం రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి కాకుండానే మూడు సినిమాలను లైన్‌ లో పెట్టాడు.

Telugu Salaar, Adipurush, Prabhas, Kgf, Nag Ashwin, Prabhas Salaar, Prashanth Ne

రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది లో పూర్తి అవ్వబోతుంది.ఆయన కమిట్‌ అయ్యి ఉన్న మూడు సినిమాల్లో ఏది మొదట పట్టాలెక్కబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.మొన్నటి వరకు ఆదిపురుష్‌ షూటింగ్‌ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు.కాని తాజాగా కేజీఎఫ్‌ డైరెక్టర్‌ వచ్చే నెల నుండే సలార్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు.మరి నాగ్‌ అశ్విన్‌ పరిస్థితి ఏంటీ.రాధేశ్యామ్‌ పూర్తి అయిన వెంటనే నాగ్‌ అశ్విన్‌ కు ప్రభాస్ డేట్లు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు.

కాని ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.ఎట్టకేలకు రాధేశ్యామ్‌ పూర్తి అవుతుంది కదా తర్వాత ఖచ్చితంగా నాగ్‌ అశ్విన్‌కు డేట్లు ఇస్తాడనుకుంటే ప్రశాంత్‌ నీల్‌కు ఇచ్చాడు.

వరుసగా సినిమాలు చేయాలనే అత్యాశ వల్ల ప్రభాస్‌ ఏ ఒక్క సినిమాకు కూడా న్యాయం చేయలేక పోతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ప్రభాస్‌ లోని ఈ జోరుతో ఆయన అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు.

ఈ నాలుగు సినిమాలు రాబోయే రెండేళ్లలోనే వస్తే వారి ఆనందంకు అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube