సలార్‌లో ప్రభాస్ గ్యారేజ్.. ఏ రేంజ్‌లో ఉండబోతుందో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రారంభించిన ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.

 Prabhas As Mechanic In Salaar, Prabhas, Salaar, Prashant Neel, Mechanic, Tollywo-TeluguStop.com

ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేయగా, రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

అయితే ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెటిజన్లను ఆకర్షిస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ ఓ మెకానిక్ పాత్రలో నటిస్తున్నాడని, ఓ మెకానిక్ గ్యారేజ్‌లో ఈ సినిమా కథ సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.

అల్టిమేటర్ రఫ్ లుక్‌లో ప్రభాస్ మెకానిక్‌గా ప్రేక్షకులను మెప్పిస్తాడనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇక ఈ సినిమా కోసం ఓ గ్యారేజ్ సెట్‌ను కూడా చిత్ర యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను గోదావరిఖనిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని చిత్ర యూనిట్ ఒప్పించే పనిలో పడ్డారు.కాగా ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేశారు.

మరి మెకానిక్ పాత్రలో ప్రభాస్ విలన్‌లకు ఎలాంటి రిపేర్లు చేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube