మరోసారి మహారాజు కాబోతున్న రెబల్‌స్టార్‌  

Prabhas As Maharaju Nag Ashwin - Telugu Baahubali, Maharaju Role, Nag Ashwin, Prabhas, Prabhas As Maharaju, Socio Fantasy

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి చిత్రంలో మహారాజుగా కనిపించి అందరిని మెప్పించిన విషయం తెల్సిందే.ప్రభాస్‌కు బాహుబలి పాత్ర ఏ స్థాయిలో సూట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Prabhas As Maharaju Nag Ashwin

ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోల్లో కేవలం ప్రభాస్‌ మాత్రమే పౌరాణిక చిత్రాలు చేయగలడు అని ఆ సినిమా నిరూపించింది అంటూ ఆయన అభిమానులు గంటా పథంగా చెబుతున్నారు.అంతటి తేజస్సు మరే హీరోకు ఉంది చెప్పండి అంటున్నారు.

అందుకే ఆయనే మరోసారి మహారాజుగా వెలుగు వెలగబోతున్నాడు.

మరోసారి మహారాజు కాబోతున్న రెబల్‌స్టార్‌-Movie-Telugu Tollywood Photo Image

సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్‌ మరోసారి మహారాజు పాత్రలో కనిపించబోతున్నాడట.

ఈ విషయంను ఆయన సన్నిహితులు కూడా నిర్ధారిస్తున్నారు.మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో ప్రభాస్‌ తదుపరి చిత్రం ఫిక్స్‌ అయ్యింది.

సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ చిత్రం ఉండబోతుంది.సినిమాలో దాదాపు గంట పాటు ఒక అద్బుత ప్రపంచంలోకి దర్శకుడు ప్రేక్షకులను తీసుకు వెళ్లబోతున్నాడట.

ఆ అద్బుత ప్రపంచంలో ప్రభాస్‌ను మహారాజుగా చూపించనున్నాడు.

ప్రభాస్‌ మహారాజుగా కనిపించే ఆ సీన్స్‌ మహాద్బుతంగా ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఈ విపత్తు వచ్చి ఉండకుంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కాని ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా నాగ్‌ అశ్విన్‌ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test