ప్రేమలో ప్రభాస్‌, అనుష్క.. ఇదే సాక్ష్యం(పీకల్లోతు ప్రేమలో.. ఇది నిజం)  

‘డార్లింగ్‌’, ‘మిర్చి’, ‘బాహుబలి’ చిత్రాల్లో నటించి సూపర్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌, అనుష్కలు ప్రేమలో ఉన్నట్లుగా మిర్చి టైం నుండి మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు వారి సన్నిహితులు కొట్టి పారేస్తూనే ఉన్నారు. అయినా కూడా దాదాపు అయిదు సంవత్సరాలుగా వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు మీడియాలో కామన్‌ అయ్యాయి...

ప్రేమలో ప్రభాస్‌, అనుష్క.. ఇదే సాక్ష్యం(పీకల్లోతు ప్రేమలో.. ఇది నిజం)-

అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరు పెళ్లికి సిద్దం అవుతున్నారు అంటూ ఒక ప్రముఖ జర్నలిస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. తనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్నాళ్లలో ఇద్దరు కూడా వివాహం చేసుకుంటారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఆ జర్నలిస్ట్‌ రాసిన పోస్ట్‌ను ప్రభాస్‌, అనుష్కలు సున్నితంగా కొట్టిపారేశారు. తామిద్దరం స్నేహితులమే అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ మద్య ప్రభాస్‌ బర్త్‌డేకు చాలా ఖరీదైన బహుమానంను అనుష్క ఇచ్చింది. అలాగే అనుష్కకు కూడా ప్రభాస్‌ చాలా విలువైన బహుమానంను ఇవ్వడం జరిగింది. ఆ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది..

ఇలా ఇద్దరి మద్య ఇచ్చుకోవడం, పుచ్చుకోవడాలు జరుగుతున్నాయి. ఇద్దరు కూడా సందర్బానుసారంగా కలవడం, ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా తాము స్నేహితులం మాత్రమే అంటూ బొంకుతూ వస్తున్నారు.

తాజాగా ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం కోసం దుబాయిలో రిష్కీ షాట్లు చేస్తున్నాడు. దాంతో రెండు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ప్రభాస్‌కు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయినా కూడా ప్రభాస్‌ సినిమా ప్రాముఖ్యత, సీన్‌కు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో డూప్‌ను వినియోగించడం లేదు.

విషయం తెలుసుకున్న అనుష్క స్వయంగా దుబాయి వెళ్లి ప్రభాస్‌ను సున్నితంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. సినిమా కోసం రిష్కీ షాట్స్‌ చేయడంను తప్పుపట్టింది. అంత రిష్క్‌ తీసుకోవాల్సిన అవసరం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిందట.

ఈ విషయం జరిగి రెండు వారాలు అవుతుంది. ఇటీవలే చిత్ర యూనిట్‌ సభ్యులు ఇండియాకు వచ్చారు. చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

మీడియాలో వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఆ ఇద్దరి నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే అనుష్క దుబాయి వెళ్లిన విషయం నిజమే అయ్యి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. ప్రభాస్‌పై అంత శ్రద్ద కనబర్చిన అనుష్కకు ప్రేమ లేదు అంటే ఎలా నమ్మగలం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి అనుష్క, ప్రభాస్‌ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశం అయ్యింది.