ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకోండి పుకార్లకు చెక్‌ పడబోతుంది  

Prabhas And Radha Krishna Movie First Look Release In Ugadhi - Telugu Prabhas 20th Film, Prabhas And Krishnam Raju, Prabhas And Pooja Hegde, Prabhas And Radha Krishna, Prabhas First Look Release In Ugadhi, Prabhas In Janu, Prabhas In Uv Creations

బాహుబలి, సాహోల మాదిరిగానే ప్రభాస్‌ 20వ చిత్రం కోసం కూడా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ అదుగో ఇదుగో అంటూ సంవత్సర కాలంగా నెట్టుకుంటూ వస్తున్నారు.

 Prabhas And Radha Krishna Movie First Look Release In Ugadhi

ఇంకా ఎంత కాలం ఈ సినిమా షూటింగ్‌ జరుపుతారు, ఇంకా ఎప్పుడు సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేస్తారు అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు చిరాకు పెడుతున్నాయి.

ప్రభాస్‌ 20వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు యూవీ క్రియేషన్స్‌ వారు ఏర్పాట్లు చేస్తున్నారట.అందుకు సంబంధించిన డిజైన్స్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.టైటిల్‌ను కూడా ఫస్ట్‌లుక్‌తో పాటు రివీల్‌ చేయాలని నిర్ణయించారు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకోండి పుకార్లకు చెక్‌ పడబోతుంది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

జాన్‌ అంటూ టైటిల్‌ ప్రచారం జరిగినా అది కాదని తెలుస్తోంది.టైటిల్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన యూనిట్‌ సభ్యులు ఉగాదికి క్లారిటీ ఇవ్వబోతున్నారట.

ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకు ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఆ విషయాన్ని ఫస్ట్‌లుక్‌ సందర్బంగా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రను కృష్ణం రాజు పోషిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు