హైదరాబాద్‌లో ప్రభాస్‌ను కలిసిన కేజీఎఫ్‌ డైరెక్టర్‌  

కేజీఎఫ్‌ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన యాక్షన్‌ సినిమాతో సౌత్‌ సినిమా స్థాయిని మరోసారి ఉత్తరాది వారికి ఎరుక చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

TeluguStop.com - Prabhas And Prashanth Neel Meeting In Hydrabad

ఇక హీరోగా ప్రభాస్‌ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరు కూడా అద్బుతంగా సౌత్‌ సినిమాల యొక్క గొప్పతనంను చాటి చెప్పారు.

వీరిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చ తీవ్రంగా జరుగుతోంది.

TeluguStop.com - హైదరాబాద్‌లో ప్రభాస్‌ను కలిసిన కేజీఎఫ్‌ డైరెక్టర్‌-Gossips-Telugu Tollywood Photo Image

వీరిద్దరి కాంబో సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు కలవడం మరింత చర్చనీయాంశంగా మారింది.

Telugu Kgf 2, Prabhas, Prabhas And Prashanth Neel, Prashant Neel, Radheshyam, Telugu Film News-Latest News - Telugu

కేజీఎఫ్‌ 2 సినిమాను హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరిస్తున్నారు.అక్కడే రాధేశ్యామ్‌ కూడా షూటింగ్‌ జరుగుతుంది.దాంతో ఇద్దరు కూడా కలిసే అవకాశం వచ్చింది.

ఇద్దరు మాట్లాడుకుంటూ కాంబో మూవీ గురించి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు.

ఆ విషయాన్ని అక్కడే ఉన్న ప్రమోద్‌ తెలియజేయడం కూడా జరిగింది.ప్రశాంత్‌ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు తాము రెడీ అన్నట్లుగా యూవీ క్రియేషన్స్‌ వారు చెప్పారు.

అయితే 2022 వరకు ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ మరియు ఆదిపురుష్‌ సినిమాలతో బిజీగా ఉంటాడు.ఆ తర్వాత ఏదైనా వీరి కాంబోలో మూవీ ప్రారంభం అయ్యేనో చూడాలి.

వీరిద్దరి కాంబోలో వస్తే అదో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ఆఫ్‌ ది ఇండియాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ప్రభాస్‌ రాధేశ్యామ్‌ ను డిసెంబర్‌ లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

ప్రశాంత్‌ నీల్‌ కూడా కేజీఎఫ్‌ 2 ను డిసెంబర్‌ లో ముగించబోతున్నాడు.ప్రశాంత్‌ నీల్‌ తదుపరి సినిమాపై క్లారిటీ రాలేదు.

#KGF 2 #Prabhas #Radheshyam #Prashant Neel #PrabhasAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas And Prashanth Neel Meeting In Hydrabad Related Telugu News,Photos/Pics,Images..