మూడు సంవత్సరాలుగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చింది.రాధే శ్యామ్ సినిమా ను ప్రారంభించి మూడు సంవత్సరాలకు పైగానే అయ్యింది.
అసలు ఈ సినిమా లో ప్రభాస్ ఏంటీ.ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు.
ఒక కొత్త దర్శకుడు ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అంటూ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు.అప్పుడప్పుడు గ్లిమ్స్.
పోస్టర్స్ విడుదల అయినా కూడా అసలు సినిమా ఏంటీ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఎట్టకేలకు టీజర్ లో హీరో పాత్ర ఏంటీ అనేది క్లారిటీ వచ్చేసింది.
ఎవరు విక్రమాధిత్య అంటూ గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ కు తెర పడింది.తెలుగు లో రాధే శ్యామ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులకు దిమ్మతిరిగి పోయేలా సినిమా ట్విస్ట్ ను రివీల్ చేయడం జరిగింది.
సినిమా లో విక్రమాధిత్య ఒక జ్యోతిష్యుడు. నీవు ఎవరో తెలుసు.నీ గురించి తెలుసు.నీ చావు కూడా తెలుసు నేను దేవుడిని కాదు కాని మీ కంటే ప్రత్యేకమైన వాడిని అంటూ ప్రభాస్ చెప్పిన ఇంగ్లీష్ డైలాగ్ సినిమా ను ఆకాశంలో నిలిపింది.
ఇలాంటి ఒక కాన్సెప్ట్ ను ఇప్పటి వరకు ఇండియన్ స్ర్కీన్ పై చూడలేదు.కనుక ఖచ్చితంగా ఇదో అద్బుతంగా ఉంటుందని అంతా అంటున్నారు.
ప్రభాస్ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఓ రేంజ్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్నందుకు ఇప్పుడు వచ్చిన టీజర్ ఖచ్చితంగా అంచనాలు మరింతగా పెంచుతుంది అంటున్నారు.
నేను ఎవరు చెప్పను అంటూ ప్రభాస్ సినిమా పై అంచనాలు మరింతగా పెంచడంతో వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కనుక ఆ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు.సినిమా విడుదల విషయంలో ఉన్న కొన్ని అనుమానాలను కాస్త పటాపంచలు చేస్తూ సినిమా ను ఖచ్చితంగా సంక్రాంతికే విడుదల చేస్తామంటూ టీజర్ లో కూడా పేర్కొన్నారు.ఆర్ ఆర్ ఆర్ తో ఖచ్చితంగా గట్టిగా ఢీ కొట్టబోతున్న సినిమా రాధే శ్యామ్ అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.